HMPV First Case In Gujarat: భారత్‌ను వణికిస్తోన్న హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పటి వరకు కర్నాటకలో రెండు కేసులు నమోదు అయ్యాయి. మూడు నెలలు, 8 నెలల చిన్నారులకు చైనా వైరస్ పాజిటివ్ వచ్చింది. అయితే, ఇప్పుడు మరో ఛేదు వార్త గుజరాత్లో మొదటి చైనా వైరస్ కేసు వెలుగులోకి వచ్చింది. దీంతో మన దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు చైనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి.
గుజరాత్లో తొలి చైనా వైరస్ కేసు నమోదు అయింది. ఈ రోజు ఉదయం నుంచి కర్నాటకలో ఇద్దరు పిల్లలకు చైనా వైరస్ పాజిటివ్ రావడంతో దేశవ్యాప్తంగా భయాందోళనకు గురయ్యారు. తాజాగా ఉత్తర భారత్‌లోని గుజరాత్లో కూడా మరో పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది.
గుజరాత్లో రెండు నెలల పసికందుకు హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్ వచ్చింది. మొదట జ్వరం, జలుబు రావడంతో పాపను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆ తర్వాత టెస్ట్ చేయించగా హెచ్ఎంపీవీ పాజిటివ్ వచ్చింది.
ఈ చిన్నారిది గుజరాత్‌లోని మోడసా గ్రామానికి చెందింది. అసలు 2001 లోనే హెచ్ఎంపీవీ వైరస్‌ను గుర్తించారు. ఇది రెస్పిరేటరీ సిన్సైటికల్ వైరస్ (RSV) ఫ్యామిలీకి చెందింది. సెరోలాజికల్ స్టడీస్ ప్రకారం ఇది 60 ఏళ్లు పైబడిన వారిలో కూడా కనిపిస్తుంది. త్వరగా వ్యాప్తిస్తుంది.
ఈ వైరస్ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ సోకుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఈ వ్యాధి మూడు నుంచి ఐదు రోజుల్లో గుర్తించవచ్చు. మాస్కులు ధరించి, చేతులు కడగడం వంటివి చేయాలి.
2023 లోనే నెదర్లాండ్, బ్రిటన్, ఫిన్లాండ్, ఆస్ట్రేలియా, కెనడా, యూఎస్, చైనాల్లో గుర్తించారు. కానీ, ఈ కేసులు ప్రస్తుతం ఎక్కువగా పెరగడంతో మరణాలు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా 40 నుంచి 80 ఏళ్ల వయస్సు వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది.