Credit Card: కంట్రోల్లో  ఉంచుకుంటే ఫర్వాలేదనిపించే సింహమే క్రెడిట్ కార్డ్. అది అదుపు తప్పితే పెద్ద సమస్యగా మారుతుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకులు చాలా ఎక్కువ వడ్డీని వసూలు చేస్తాయి. వడ్డీపై పరిమితి ఉండాలన్న జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్ తీర్పును సుప్రీంకోర్టును పక్కకు పెట్టింది. దీంతో నిర్ణీత గడువులోకా బిల్లు చెల్లించని వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో వడ్డీ వసూలు చేసుకునేందుకు బ్యాంకులకు మార్గం మరింత సుగుమం అయ్యింది. కాబట్టి క్రెడిట్ కార్డు వాడకందారులు సకాలంలో బిల్లు చెల్లించడంపై దృష్టి సారించాలని నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్రెడిట్  కార్డులపై 36 నుంచి 50శాతం వరకు వార్షిక వడ్డీ వసూలు చేయడం చాలా ఎక్కువని  ఎన్‌సీడీఆర్‌సీ పేర్కొంది. దీన్ని తప్పుడు వ్యాపార పద్దతిగా NCDRC పేర్కొంది. ఎన్‌సిడిఆర్‌సి నిర్ణయంపై  సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో బ్యాంకులకు ఊరట లభించినట్లయ్యింది. బ్యాంకులు ఇప్పుడు క్రెడిట్ కార్డులపై 30 శాతం కంటే ఎక్కువ లేదా 50 శాతం వరకు వడ్డీని వసూలు చేయనున్నాయి.  


కన్స్యూమర్ కోర్టు క్రెడిట్ కార్డులపై గరిష్టంగా 30శాతం వడ్డీ రేటును పరిమితం చేసింది. బ్యాంకులు, వినియోగదారుల మధ్య చర్చలు అసమాన నిబంధనలపై ఉన్నాయని కన్స్యూమర్ కమిషన్ పేర్కొంది. క్రెడిట్ కార్డ్ సౌకర్యాన్ని తిరస్కరించడం తప్ప, వినియోగదారులకు క్రెడిట్ కార్డ్‌లతో బేరసారాలు చేసే శక్తి లేదు.వినియోగదారుడు తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైనందుకు అధిక జరిమానా చెల్లించవలసి వస్తే, అది అన్యాయమైన వాణిజ్య విధానంగా పరిగణించబడుతుందని కమిషన్ పేర్కొంది. దీని కోసం, వినియోగదారుల కోర్టు వివిధ దేశాల క్రెడిట్ కార్డుల వడ్డీ రేట్లను పోల్చింది.


Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర..ఎంత పెరిగిందంటే?  


నిపుణులు ఏం చెబుతున్నారు? 


క్రెడిట్ కార్డు అనేది సక్రమంగా వాడితే..అది ఇచ్చే ప్రయోజనాలు చాలా ఉంటాయి. అత్యవసర సమయాల్లో ఉపయోగించడంతోపాటు మన రోజువారీ ఖర్చులకు కార్డును వాడటం ద్వారా రివార్డు పాయింట్స్ కూడా పొందవచ్చు. మనం వాడుకున్న మొత్తానికి దాదాపు 45రోజుల వడ్డీ రహిత గడువు కూడా ఉంటుంది. కాబట్టి గడువులోకా బిల్లు చెల్లిస్తే క్రెడిట్ కార్డుతో ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ బిల్లు చెల్లించకపోతే మాత్రం భారీగా వడ్డీ చెల్లించాల్సిందే. కాబట్టి వడ్డీ రహిత గడువులోకా నిర్ణీత మొత్తాన్ని చెల్లించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకునేవారు బ్యాంకులు నిబంధనలు, ఫైన్ తో చెల్లింపులపై విధించే వడ్డీ రేట్ల వివరాలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం మంచిదని సూచిస్తున్నారు. 


Also Read:School Holidays: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, ఏకంగా 15 రోజులు సెలవులు ఎక్కడంటే


 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook