Gold Rate Today: బంగారం ప్రియులకు మరోసారి షాకిచ్చాయి ధరలు. మరోసారి బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. గత వారం రోజుల్లో కేవలం ఒక్కరోజు మాత్రమే బంగారం ధర పెరిగింది. ఇప్పుడు మళ్లీ స్వల్పంగా పెరిగింది. గత మూడు రోజులుగా పతనమవుతోన్న బంగారం ఇప్పుడు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది.
శనివారం, ఆదివారాల్లో బంగారం ధర మారదని చెప్పవచ్చు. మళ్లీ సోమవారం రోజు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్కాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2623.25 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు 29. 56 డాలర్లకు చేరుకుంది. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ కిందటి రోజుతో పోల్చినట్లయితే స్వల్పంగా పుంజుకుంది. ప్రస్తుతం అది రూ. 84,988దగ్గర ఉంది.
దేశీయంగా బంగారం ధరలను చూసినట్లయితే హైదరాబాద్ లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,115 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,100 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్ బాటలోనే దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయని చెప్పవచ్చు. ఇక్కడ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 600 పెరిగింది.
తులం రూ. 71,150కిచేరుకుంది. కిందటి రోజు రూ. 70, 550 దగ్గర ఉండేది. 24క్యారెట్ల బంగారం ధరరూ. 650 పెరిగింది. 10 గ్రాముల ధర ఇప్పుడు రూ. 77,600 మార్కుకు చేరుకుంది. వరుసగా 3 రోజుల వ్యవధిలో రూ. 330 రూ. 710, రూ. 160 చొప్పున బంగారం ధర దిగివచ్చింది.
Also Read: YS Sharmila: న్యూ ఈయర్‌కు ఏపీలో మహిళలకు ఉచిత బస్సు.. వైఎస్ షర్మిల ప్రశ్నలు ఇవే!
ఇక బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. ఢిల్లీలో ఒక్కరోజులో రూ. 1000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధరరూ. 91,500 మార్కుకు చేరుకుంది. హైదరాబాద్ నగరంలోనూ వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. శనివారం 98వేల ఉన్న కిలో వెండి ధరల ఇప్పుడు 99వేలకు చేరుకుంది.
Also Read: Chandrababu: కబ్జారాయుళ్లకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. కబ్జా చేస్తే జైలుకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook