SIP Tips: దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందేందుకు సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అనేది మంచి ప్రత్యామ్నాయం. ఇందులో ఒకేసారి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. నెలకు తగిన మొత్తం ఇన్వెస్ట్ చేస్తే చాలు. తక్కువ పెట్టుబడిలో షేర్ మార్కెట్‌లో అదృష్టం పరీక్షించుకునేవారికి ఇది చాలా ఉపయోగకరం. అందుకే ఈ మధ్యకాలంలో ఎస్ఐపీలకు ఆదరణ పెరుగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎస్ఐపీ ద్వారా నెలకు 10 వేలు ఇన్వెస్ట్ చేయడం మొదలెడితే మీ భవిష్యత్ కోసం ఏకంగా 10 కోట్ల ధనం కూడబెట్టవచ్చు. తక్కువ వయస్సుకే ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించాల్సి ఉంటుంది. అంటే 25 ఏళ్ల వయస్సులో నెలకు 10 వేల చొప్పున ఇన్వెస్ట్‌2మెంట్ ప్రారంభిస్తే రిటైర్మెంట్ సమయానికి 10 కోట్లు సంపాదించవచ్చు. వార్షికంగా రిటర్న్స్ కనీసం 12 శాతం ఉండవచ్చని అంచనా. మీ వయస్సు 66 వచ్చేసరికి 10 కోట్లు జమ అవుతాయి. మీరు పెట్టిన పెట్టుబడి 49 లక్షల 20 వేలు కాగా మీ లాభం 10 కోట్ల 48 లక్షల 90 వేలు అవుతుంది. అంటే 41 ఏళ్లలో 10 కోట్లు జమ చేయవచ్చు. అదే వార్షిక రిటర్న్స్ 13 శాతముంటే 10 కోట్లు కూడబెట్టేందుకు 38 ఏళ్లు పడుతుంది. ఇక వార్షిక రిటర్న్స్ 14 శాతముంటే 36 ఏళ్లలో 10 కోట్లు సంపాదించవచ్చు. 


ఒక్కోసారి మ్యూచ్యువల్ ఫండ్స్‌లో రిటర్న్స్ 15 శాతం కూడా ఉండవచ్చు. అదే జరిగితే  కేవలం 34 ఏళ్లలో అంటే రిటైర్మెంట్‌కు ముందే 10 కోట్లు సంపాదించవచ్చు. మీ ఇన్వెస్ట్‌మెంట్ 40 లక్షల 80 వేలుంటే మీ లాభం 9 కోట్ల 50 లక్షల 66 వేల 868 రూపాయలుంటుంది. 


Also read: Railway Jobs: కేవలం 10వ తరగతి విద్యార్ఙతతో 63 వేల జీతంతో రైల్వేలో ఉద్యోగాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.