Tata Altroz Cars: టాటా ఆల్ట్రోజ్ కారు కొనే వారికి ఇప్పుడు మరిన్ని ఆప్షన్స్ పెరిగాయి. ఈ జాబితాలో కొత్తగా మరో రెండు వేరియంట్స్ యాడ్ అయ్యాయి. టాటా ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారులో రెండు వేరియంట్స్ వచ్చి చేరాయి. అందులో ఒకటి XM వేరియంట్ కాగా రెండోది XM(S) వేరియంట్. XM వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 6.90 లక్షలు కాగా XM(S) వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 7.35 లక్షలుగా ఉంది. ఆల్ట్రోజ్ కారులో ఈ రెండు కొత్త వేరియంట్స్ లాంచ్ అయిన సందర్భంగా టాటా మోటార్స్ కంపెనీ ఇంట్రాడక్టరీ ఆఫర్ కింద ఈ ధరకు అందిస్తోంది. కొంత కాలం తరువాత కానీ లేదా టాటా మోటార్స్ కంపెనీ నిర్ణయించుకున్న సంఖ్యలో కార్ల అమ్మకాలు జరిగిన తరువాత, ఈ ధరలు పెరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఇంట్రాడక్టరీ ఆఫర్స్ కింద ఏ కంపెనీ అయినా ప్రకటించే ధరల్లో సహజంగా జరిగేది ఇదేననే విషయం తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్తగా లాంచ్ అయిన XM, XM(S).. రెండు వేరియంట్స్ కూడా XE వేరియంట్ కంటే పై స్థాయి వాహన శ్రేణిలోనిలో ఉండేవే అని టాటా మోటార్స్ ప్రకటించింది. 1.2 రెవోట్రన్ పెట్రోల్ ఇంజన్‌తో నడిచే ఈ రెండు వేరియంట్ కార్లలోనూ మ్యాన్వల్ గేర్ బాక్స్ అమర్చారు. ఈ రెండు కొత్త వేరియంట్స్ రాకతో ఇండియాలోనే అత్యంత సరసమైన ధరల్లో లభించే హ్యాచ్ బ్యాక్ కార్లలో టాటా ఆల్ట్రోజ్ కారు ముందు వరుసలోకి వచ్చి చేరింది. ఎలక్ట్రిక్ సన్ రూఫ్ ఫీచర్‌తో ఈ రెండు కార్లు లభిస్తుండటం మరో విశేషం. 


ఆల్ట్రోజ్ XM వేరియంట్ కారులో మల్టీఫంక్షన్ స్టీరింగ్, డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్, ఫోల్డబుల్ ఓఆర్‌వీఎంస్, 16 అంగుళాల వీల్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ కారులో ఉన్న మరో గొప్ప ప్లస్ పాయింట్ ఏంటంటే.. సేఫ్టీ పరంగా 5 స్టార్ ఎన్సీఏపీ ప్రీమియం రేటింగ్స్ ఉన్న కారుగా టాటా ఆల్ట్రోజ్ కారు ఇమేజ్ సొంతం చేసుకుంది. నాలుగు పవర్ విండోస్, రిమోట్ కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. 


ఇది కూడా చదవండి : Hyundai Sante Fe: హ్యూందాయ్ నుండి ఈ కొత్త కారు చూశారా ? డిజైన్ చూస్తే పిచ్చెక్కిపోతుంది


కొత్తగా యాడ్ అయిన XM వేరియంట్ , XM(S) వేరియంట్ కార్లు టాటా ఆల్ట్రోజ్ కార్ల లుక్‌లో భారీ మార్పులు తీసుకురావడమే కాకుండా హ్యాచ్‌బ్యాక్ కార్ల అమ్మకాల పరంగానూ టాటా మోటార్స్‌ని అగ్రస్థానంలో నిలిపే అవకాశం ఉంది అని ఆ కంపెనీ ఆశిస్తోంది. ఇప్పటికే ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా ఆల్ట్రోజ్ కార్లకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. కంపెనీ ఆశిస్తున్నట్టుగా ఈ రెండు వేరియంట్స్ టాటా ఆల్ట్రోజ్ మోడల్ కారుకి ఉన్న డిమాండ్ పెంచే అవకాశం లేకపోలేదు అని ఇండస్ట్రీ వర్గాలు సైతం భావిస్తున్నాయి.


ఇది కూడా చదవండి : Safe & Best Cars in India: తక్కువ ధరలో వచ్చే బెస్ట్ సేఫ్టీ కార్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి