Tata Altroz CNG Car: అద్దిరిపోయే అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు

టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ కారు ఇండియాలో లాంచ్ అయింది. టాటా మోటార్స్ కస్టమర్స్ ఎప్పటి నుంచో వేచిచూస్తున్న హ్యాచ్ బ్యాక్ సీఎన్జీ కార్లలో టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ కారు కూడా ఒకటి. మే 22న లాంచ్ అయిన ఈ కారు పర్‌ఫార్మెన్స్, ఫీచర్స్, సేఫ్టీ, బూట్‌స్పేస్ పరంగా రాజీపడే ప్రసక్తే లేదని టాటా మోటార్స్ చెబుతోంది.

Tata Altroz CNG Car: టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ కారు ఇండియాలో లాంచ్ అయింది. టాటా మోటార్స్ కస్టమర్స్ ఎప్పటి నుంచో వేచిచూస్తున్న హ్యాచ్ బ్యాక్ సీఎన్జీ కార్లలో టాటా ఆల్ట్రోజ్ ఐసీఎన్జీ కారు కూడా ఒకటి. మే 22న లాంచ్ అయిన ఈ కారు పర్‌ఫార్మెన్స్, ఫీచర్స్, సేఫ్టీ, బూట్‌స్పేస్ పరంగా రాజీపడే ప్రసక్తే లేదని టాటా మోటార్స్ చెబుతోంది.

1 /6

Tata Altroz CNG Car: టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు బేసిక్ వేరియంట్ దేశవ్యాప్తంగా ఎక్స్ షోరూం ధర 7.55 లక్షలు కాగా ఆ కారు వేరియంట్‌ని బట్టి రూ. 10.55 లక్షల వరకు ఉంది.

2 /6

Tata Altroz CNG Car Booking Amount: టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు బుకింగ్ చేసుకోవాలనుకునే వారు రూ. 21 వేలు టోకెన్ ఎమౌంట్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

3 /6

Tata Altroz CNG Car Variants : టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు మొత్తం 6 వేరియంట్స్‌లో లాంచ్ అయింది.  XE CNG, XM+ CNG, XM+ (S) CNG, XZ CNG, XZ+ (S) CNG, XZ+O (S) CNG వేరియంట్స్‌లో కార్లు లాంచ్ అయ్యాయి.

4 /6

Tata Altroz CNG Car Advanced Features: ట్విన్ సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీతో పాటు వాయిస్ అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్లెస్ చార్జర్, ఎయిర్ ప్యూరిఫయర్ వంటి లేటెస్ట్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఎలిమెంట్స్ ఎన్నో ఈ కారుకి అదనపు హంగులు కానున్నాయి. 

5 /6

Tata Altroz CNG Car Color Variants : టాటా ఆల్ట్రోజ్ సీఎన్జీ కారు కలర్ వేరియంట్స్ విషయానికొస్తే.. ఆర్కేడ్ గ్రే, హై స్ట్రీట్ గోల్డ్, ఒపెరా బ్లూ, డౌన్‌టౌన్ రెడ్, అవెన్యూ వైట్, హార్బర్ బ్లూ, కాస్మో డార్క్ కలర్ వేరియంట్స్‌లో ఈ కారు లభిస్తోంది. 

6 /6

Tata Altroz CNG Car Air Bags: డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, కార్నర్ స్టెబిలిటి కంట్రోల్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ టెదర్ యాంకరేజ్, ఆటో హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ లాంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ కూడా ఈ కారు సొంతం.