TATA Altroz Price and Features: ప్రస్తుతం మార్కెట్‌లో టాటా మోటర్స్ కార్లకు మంచి డిమాండ్ నెలకొంది. టాటా మోటార్స్ పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ సెడాన్, కాంపాక్ట్ SUV, మిడ్-సైజ్ SUV తదితర డిఫరెంట్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. టాటా మోటార్ మనం దేశంలో అత్యంత చౌకైన డీజిల్ కారు టాటా ఆల్ట్రోజ్ ఉంది. ఈ కారు మూడు ఇంధన ఆప్షన్స్‌లో ఉంది. పెట్రోల్, సీఎన్‌జీ, డీజిల్‌ ఇంధనంతో మార్కెట్లో మారుతి సుజుకి బాలెనోతో పోటీపడుతోంది. బాలెనో, ఆల్ట్రోజ్ అమ్మకాలలో భారీ డిఫరెన్స్ ఉంది. ప్రస్తుతం బాలెనో దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఆల్ట్రోజ్ మాత్రం అమ్మకాలలో వెనుకంజలో ఉంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Ustaad Bhagat Singh Dialogue: వైరల్ అవుతున్న గాజు గ్లాస్ డైలాగ్, ఈసీ ఏం చేయనుంది


మార్కెట్‌లో టాటా ఆల్ట్రోజ్ ధర రూ.6.65 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. టాప్ వేరియంట్ మోడల్ రూ.10.80 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు అందుబాటులో ఉంది. డీజిల్ వేరియంట్‌ ధర విషయానికి వస్తే.. రూ.8.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతోంది. డీజిల్ ఇంధనంతో దీని బేస్ వేరియంట్ XM ప్లస్ డీజిల్. 


ఆల్ట్రోజ్ కారులో 1.2-లీటర్ పెట్రోల్, 1.2-లీటర్ టర్బోచార్జ్‌డ్‌ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్లు ఉన్నాయి. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మూడింటితో స్టాండర్డ్‌గా వస్తుంది. దీని డీజిల్ ఇంజన్ 90PS@4000rpm, 200Nm@1250-3000rpmని జనరేట్ చేస్తుంది. ఈ ఇంజన్ 23.64kmpl మైలేజీని ఇస్తోంది. 


ఆల్ట్రోజ్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, సింగిల్-పేన్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, హైట్ అడ్జట్‌మెంట్‌తో డ్రైవర్ సీటు, పవర్ విండోస్, లెదర్ స్టీరింగ్ వీల్ వంటివి ఉన్నాయి. సీట్లు, హెడ్‌లైట్స్ అడ్జట్‌మెంట్స్, ఫాగ్ లైట్లు (ఫ్రంట్ అండ్ బ్యాక్), బ్యాక్ డీఫాగర్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, అల్లాయ్ వీల్స్ వంటి అనేక ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. అంతేకాదు 5-స్టార్ సేఫ్టీ రేటెడ్‌తో ఉంది. గ్లోబల్ NCAP తన క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ఇచ్చింది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ISOFIX చైల్డ్-సీట్ యాంకర్స్, ఆటో పార్క్ లాక్, బ్యాక్ సైడ్ పార్కింగ్ సెన్సార్‌లతో అందుబాటులో ఉంది.


Also Read: Summer Heat Stroke: దంచికొడుతున్న ఎండలు.. ఈ సింప్టమ్స్ కన్పిస్తే వడదెబ్బ తగిలినట్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter