Tata Cars Offers 2023, Rs 75000 offer on Tata Safari and Tata Harrier Car 2023 Model: కొత్త సంవత్సరం 2023 వచ్చి వారం గడిచింది. సాధారణంగా జనవరి నెలలో అన్ని కార్ల తయారీదారులు తమ కార్ల ధరలను అప్‌డేట్ చేస్తాయి. ఇందులో భాగంగా ధరలు పెరగడం లేదా తగ్గడం జరుగుతుంటుంది. అదే సమయంలో కార్ల తయారీదారులు సంవత్సరం ప్రారంభంలో తమ కార్లపై తగ్గింపు ఆఫర్‌లను కూడా అందిస్తాయి. ఈ క్రమంలో ప్రముఖ మోటార్ సంస్థ 'టాటా మోటార్స్' కస్టమర్ల కోసం పలు కార్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ ఆఫర్‌లు జనవరి 31 వరకు ఉన్నాయి. ఆ కార్ల జాబితాను ఓసారి చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tata Tiago: 
టాటా టియాగో 2022 మోడల్‌పై రూ. 45,000 వేల వరకు ఆఫర్‌ ఉంది. 2023 మోడల్‌పై రూ. 25,000 వరకు ఆఫర్‌ ఉంది. వీటిలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. టాటా టియాగో ధర రూ. 5.45 లక్షల నుంచి రూ. 7.90 లక్షల మధ్య ఉంటుంది.


Tata Tigor:
టాటా టిగోర్ 2022 మోడల్‌కు రూ. 50,000 వరకు ఆఫర్‌ ఉండగా.. 2023 మోడల్‌పై రూ. 25,000 వరకు ఆఫర్‌ ఉంది. ఏ ఆఫర్‌లలో నగదు తగ్గింపు, ఎక్స్‌ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ తగ్గింపు ఉన్నాయి. టిగోర్ ధర రూ. 6.10 లక్షల నుంచి రూ. 8.84 లక్షల మధ్య ఉంటుంది.


Tata Altroz:
టాటా ఆల్ట్రోజ్ 2022 మోడల్‌పై రూ. 38,000 వేల వరకు ఆఫర్‌ ఉండగా.. 2023 మోడల్‌పై రూ. 23,000 వరకు ఆఫర్‌ ఉంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఆల్ట్రోజ్ ధర రూ. 6.35 లక్షల నుంచి రూ. 10.25 లక్షల మధ్య ఉంటుంది.


Tata Safari, Tata Harrier, Tata Nexon:
హారియర్ 2022 మోడల్‌పై రూ.75,000 వేలు, 2023 మోడల్‌పై రూ.45,000 వరకు ఆఫర్‌లు ఉన్నాయి. సఫారీ 2022 మోడల్‌పై రూ. 75,000 వేలు, 2023 మోడల్‌పై రూ. 45,000 వరకు ఆఫర్‌ ఉంది. నెక్సాన్‌పై మాత్రమే రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపు ఉంది. సఫారీ ధర రూ. 15.45 లక్షల నుంచి రూ. 23.76 లక్షల వరకు ఉండగా.. హారియర్ ధర రూ. 14.80 లక్షల నుంచి రూ. 22.35 లక్షల వరకు ఉంది. ఇక నెక్సాన్ ధర రూ. 7.70 లక్షల నుంచి రూ. 14.18 లక్షల వరకు ఉంటుంది.


Also Read: Best Selling Sedan Car: బ్రెజా, పంచ్, క్రెటా లాంటి ఎస్‌యూవీలను కాకుండా.. ఈ చౌకైన సెడాన్‌ను ఎగబడి కొంటున్నారు!


Also Read: TVS Metro Plus 110: టీవీఎస్ సరికొత్త బైక్‌.. సామాన్యులకు అందుబాటు ధర! సూపర్ మైలేజ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.