ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్లు వేగం పుంజుకుంటున్నాయి. ఇండియాలో టాటా సంస్థ ఒక్కటే ఈ రంగంలో ముందుంది. అదే సమయంలో టాటా సంస్థ ఎలక్ట్రిక్ కార్లకు వెయిటింగ్ పీరియడ్ కూడా ఎక్కువే ఉంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టాటా మోటార్స్ ముందు వరుసలో ఉంది. ఇప్పటికే టాటా ఎలక్ట్రిక్ వాహనాల్లో Nexon EV, Nexon Max, Tigor EV, XpresT ఉన్నాయి. త్వరలో టాటా పంచ్ ఈవీ కూడా మార్కెట్‌లో రానుంది. మీరు కూడా టాటా ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేయాలంటే..వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువే ఉంది. ఏకంగా 3-4 నెలల వరకూ నిరీక్షించాల్సిందే. టాటా ఎలక్ట్రిక్ కార్లలో అన్నింటికంటే ఎక్కువగా టాటా నెక్సాన్‌కు డిమాండ్ ఉంది. టాటా కంటే ముందు మహీంద్రా కంపెనీ E2o, E2o plus,eVerito మోడల్స్ లాంచ్ చేసినా అవి విఫలమయ్యాయి.


1. టాటా నెక్సాన్ ఈవి మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాటా ఎలక్ట్రిక్ కారు. వెయిటింగ్ పీరియడ్ 90-120 రోజుల వరకూ ఉంది. ఈవి అనేది నెక్సాన్ పాత మోడల్. ఇప్పుడు అప్‌గ్రేడ్ వెర్షన్ కూడా వచ్చేసింది.


2. టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ పూర్తిగా ఎలక్ట్రిక్ కారు కాన్సెప్ట్‌తో ఉంటుంది. ఇందులో బ్యాటరీ ప్యాక్ ఉంది. మైలేజ్ రేంజ్ కూడా పెరిగింది. డిజైన్‌పరంగా మార్పులున్నాయి. వెయిటింగ్ పీరియడ్ 90-120 రోజులుంది.


3. టాటా టిగోర్ ఈవి కూడా టాటా సంస్థ తొలి ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. సీఎన్‌జి, ఎలక్ట్రిక్ ఆప్షన్లలో లభించే కారు ఇది. ఈ కారు వెయిటింగ్ పీరియడ్ 45-60 రోజులుంది.


4. టాటా ఎక్స్‌ప్రెస్ టి అనేది సెడాన్ మోడల్ కారు. ఇందులో రెండు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.  XpresT 165, XpresT 213 ఉన్నాయి. ఈ కార్ల వెయిటింగ్ పీరియడ్ 60-90 రోజులుంది.


Also read: Railway privatisation: భారతీయ రైల్వే ప్రైవేటీకరణ ఎప్పుడు, స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook