Tata Group: 18 ఏళ్ల తరువాత టాటా గ్రూప్ నుంచి మరో ఐపీవో
Tata Group: ప్రముఖ పారిశ్రామిక సంస్థ టాటా గ్రూప్ నుంచి మరో కంపెనీ ఐపీవో విడుదల కానుంది. టాటా గ్రూపు నుంచి ఐపీవో వెలువడటం 18 ఏళ్ల తరువాత ఇదే కావడం విశేషం. త్వరలో టాటా టెక్నాలజీస్ ఐపీవో వెలువడనుంది.
టాటా గ్రూప్ అనుబంధ సంస్థ టాటా టెక్నాలజీస్ కంపెనీ ఐపీవో స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ కానుంది. టాటా టెక్‌లో ఉన్న వాటాలో కొంతమొత్తాన్ని పబ్లిక్ ఫ్లోట్‌లో విక్రయించేందుకు టాటా మోటార్స్ బోర్డ్ 2022 డిసెంబర్ నెలలో ఆమోదించింది.
టాటా గ్రూప్ కంపెనీ ఐపీవో రావడం దాదాపు 18 ఏళ్ల తరువాత ఇదే. టాటా టెక్నాలజీస్ ఈ ఐపీవో ద్వారా 4 వేల కోట్లు సమీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తద్వారా కంపెనీ విలువన 16,200 కోట్ల నుంచి 20 వేల కోట్లుగా అంచనా వేస్తోంది. డిసెంబర్ 12, 2022న జరిగిన సమావేశంలో టాటా మోటార్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లతో ఐపీవో కమిటీ ఏర్పాటైంది. మార్కెట్ పరిస్థితులు, వర్తించే అనుమతులు, రెగ్యులేటరీ క్లియరెన్స్‌ల ప్రకారం తగిన సమయంలో ఐపీవో ద్వారా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ లో పెట్టుబడిని టాటా మోటార్స్ కొంతమేర ఉపసంహరించుకోనుందని స్టాక్ ఎక్స్చేంజ్ పైలింగ్‌లో తెలిపింది.
టాటా టెక్నాలజీస్‌లో టాటా మోటార్స్ వాటా 74.42 శాతముంది. టాటా క్యాపిటల్ అడ్వైజర్స్ నిర్వహణలో సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆల్ఫా టీసీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాటా 8.96 శాతం కాగా టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ సంస్థకు 4.48 శాతం వాటా ఉంది.
టాటా టెక్నాలజీస్ ఐపీవో విడుదలైతే 18 ఏళ్ల తరవాత టాటా గ్రూప్ నుంచి వెలువడే ఐపీవో ఇదే కానుంది. టాటా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ టీసీఎస్ నుంచి చివరి ఐపీవో విడుదలైంది. టాటా టెక్నాలజీస్ సంస్థలో యూరప్, ఉత్తర అమెరికా, ఆసియా-పసిఫిక్ దేశాల్లో మొత్తం 9,300 మంది ఉద్యోగులున్నారు. మరోవైపు టాటా ప్లే కూడా త్వరలో ఐపీవో విడుదల చేయనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook