Tata Harrier Ev Price: క్రమంగా భారత ఆటో మొబైల్‌ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్ కార్ల డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో టాటా మోటా ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. దీంతో పాటు భారత ఆటో మార్కెట్‌లో టాటా కార్ల విక్రయాలు ఒక్కసారిగా 70 శాతం పెరిగిపోయాయి. అయితే దీనిని దృష్టిలో పెట్టుకుని టాటా కంపెనీ ప్రత్యేకమై ఫీచర్స్‌తో EV కార్లలను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఇటీవలే మార్కెట్‌లో  టాటా పంచ్ EV, టాటా టియాగో EV, టాటా టిగోర్ EV కార్లకు మంచి ప్రజాదరణ లభించడంతో మరో ఎలక్ట్రిక్‌ కారును విడుదల చేయబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోయే ఎలక్ట్రిక్‌ కారేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా కంపెనీ త్వరలోనే ఎంతో ప్రసిద్ధి కలిగి హారియర్ SUV కారు ఎలక్ట్రిక్‌ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ 2025 సంవత్సరంలోరి మొదటి నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారు అనేక శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంత కంపెనీ దీనిని ప్రీమియం డిజైన్‌తో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


500 కిమీ రేంజ్‌:
ఇటీవలే లీక్‌ అయిన వివరాల ప్రకారం..టాటా హారియర్ EV ప్రీమియం లుక్‌లో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీ ఇస్తుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ కారు కస్టమర్‌లు ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రత్యేకమైన సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇది టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, కెపాసిటివ్ కంట్రోల్స్ ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఆపిల్ కార్‌ప్లేతో పాటు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వైర్‌లెస్‌తో అందుబాటులోకి వచ్చింది. 
 
టాటా హారియర్ EV ఎలక్ట్రిక్‌ కారు 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే 2 ADAS టెక్నాలజీతో పాటు వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఎన్నో రకాల కొత్త ఫీచర్లను తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు టాటా కంపెనీ ఈ కారును అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది. ఇక ఈ కారు విషయానికొస్తే.. దీనిని కంపెనీ రూ.25 లక్షల కంటే తక్కువ ధరలో లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
పూర్తి-వెడల్పు LED టెయిల్-ల్యాంప్‌లు
పగటిపూట రన్నింగ్ లైట్లు
సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్ 
ట్విన్-మోటార్ సెటప్
400 కిమీల డ్రైవింగ్ రేంజ్‌ 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి