Tata Cars Discount offers: టాటా కంపెనీ కార్లంటే మార్కెట్‌లో క్రేజ్ ఎక్కువే. మారుతి సుజుకి, హ్యుండయ్ కార్లతో పాటు టాటా మోటార్స్ కార్లు విక్రయమౌతుంటాయి. ప్రతియేటా ప్రకటించినట్టే టాటా మోటార్స్ ఈసారి కూడా వివిధ కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ముఖ్యంగా టాటా నెక్సాన్, టాటా టియాగో, టాటా ఆల్ట్రోజ్, టిగోర్ కార్లపై ఈ భారీ డిస్కౌంట్ లభించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా మోటార్స్ కంపెనీ కొన్ని కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. కొన్ని కార్లపై అయితే ఏకంగా 60 వేల వరకూ డిస్కౌంట్ అందిస్తోంది. మీరు కూడా కొత్త కారు కొనాలంటే ఇదే మంచి అవకాశం. టాటా టియోగో అనేది మంచి హ్యాచ్‌బ్యాక్ కారు. టాటా టియాగో పెట్రోల్ వేరియంట్ XT(o), XT, XZ కార్లపై 60 వేల రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది. 45 వేల రూపాయలు క్యాష్ డిస్కౌంట్ రూపంలోనూ, 10 వేల రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ రూపంలోనూ, 5 వేల రూపాయలు కార్పొరేట్ బెనిఫిట్ రూపంలోనూ కంపెనీ అందిస్తోంది. టియాగో ఇతర పెట్రోల్ వేరియంట్లపై 35 వేల క్యాష్ డిస్కౌంట్ లభించనుంది. టియాగో సీఎన్జీ మోడల్ కారుపై 25 వేల రూపాయలు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. 


టాటా నెక్సాన్ ఎస్‌యూవీ డీజిల్ మోడల్‌పై 20 వేల రూపాయలు డిస్కౌంట్ లభించనుంది. ఇందులో 15 వేల రూపాయలు క్యాష్ డిస్కౌంట్ , 5 వేల రూపాయలు కార్పొరేట్ డిస్కౌంట్ అందుతుంది. పెట్రోల్ వేరియంట్‌పై 10 వేల రూపాయలు క్యాష్ డిస్కౌంట్, 5 వేల రూపాయలు కార్పొరేట్ డిస్కౌంట్ అందుతుంది. ఎక్స్చేంజ్ బోనస్ మాత్రం లేదు. టాటా పంచ్‌పై మాత్రం కేవలం 3000 రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. హ్యారియర్, సఫారీ ఎస్‌యూవీపై 50 వేల నుంచి 75 వేల రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ లభించనుంది.


టాటా ఆల్ట్రోజ్ డీజిల్, పెట్రోల్ మేన్యువల్ ట్రాన్స్‌మిషన్ కార్లపై 50 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో 35 వేల రూపాయలు క్యాష్ డిస్కౌంట్, 10 వేల రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్, 5000 రూపాయలు కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది. అల్ట్రోజ్ సీఎన్జీ మోడల్2పై 35 వేల రూపాయలు లాభం పొందవచ్చు. ఇందులో 20 వేల రూపాయల క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఉంది.


టాటా టిగోర్ కారుపై 55 వేల రూపాయలు డిస్కౌంట్ లభించనుంది. టిగోర్ XZ Plus, XM మోడల్ కార్లపై 40 వేల రూపాయలు క్యాష్ డిస్కౌంట్, 10 వేల రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్, 5000 రూపాయలు కార్పొరేట్ బెనిఫిట్ లభించనుంది. ఇతర వేరియంట్లపై 30 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తోంది. 


Also read: TVS iQube: అద్భుత మైలేజ్, అతి తక్కువ ధరతో TVS నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్, ఫీచర్లు ధర ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook