Tata Motors: ఎలక్ట్రిక్ కారు కొనాలంటే ఇదే మంచి అవకాశం, టాటా ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్
Tata Motors: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ కార్లు కొనాలని ఆలోచించేవారికి ఇదే మంచి అవకాశం. టాటా సంస్థ భారీ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. ఏయే వాహనాలపై ఎంత డిస్కౌంట్ ఇస్తుందో తెలుసుకుందాం.
Tata Motors: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా ఎలక్ట్రిక్ వాహనాలపై భారీ డస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. టాటా టియాగో, టాటా నెక్సాన్ మోడల్ కార్లపై ఊహించని డిస్కౌంట్ ఇస్తోంది. మార్కెట్‌లో పోటీ తట్టుకునేందుకు టాటా మోటార్స్ ఈ డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోంది. గరిష్టంగా 70 వేల నుంచి 1.20 లక్షల వరకూ తగ్గింపు లభిస్తోంది.
దేశంలో ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టాటా మోటార్స్ ముందంజలో ఉంది. దాదాపు అన్ని మోడల్ కార్లకు ఈవీ వేరియంట్ అందుబాటులో తీసుకొచ్చింది. ఇప్పుడు మార్కెట్‌లో వాటా పెంచుకునేందుకు రెండు ప్రముఖ ఈవీ మోడళ్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. Tata Tiago EV XE MR వేరియంట్‌పై గరిష్టంగా 70 వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తోంది. వాస్తవానికి ఈ కారు ధర 8.69 లక్షల రూపాయలు కాగా ఇప్పుడు డిస్కౌంట్ తరువాత 7.99 లక్షలకే పొందవచ్చు. ఇక Tata Tiago EV XT MR వేరియంట్‌పై 35 వేల రూపాయలు, Tata Tiago EV XT LR కారుపై 20 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తోంది. ఇవే కాకుండా టాటా టియాగో XZ plus LR, XZ plus Tech LX,LR,XZ Plus LR వంటి మోడళ్లపై 20 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది.
టాటా టియాగో ఈవీ 19.2 కిలోవాట్ బ్యాటరీ, 24 కిలోవాట్ బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తోంది. 19,2 కిలోవాట్ బ్యాటరీ ఫుల్‌ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్ల మైలేజ్ పొందవచ్చు. ఈ కారు 61 హెచ్‌పి పవర్,110 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 24 కిలోవాట్స్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే 315 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కారు 75 హెచ్‌పి పవర్, 114 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.
టాటా టియాగోతో పాటు టాటా నెక్సాన్ ఈవీపై కూడా కంపెనీ భారీగా డిస్కౌంట్ అందిస్తోంది. గరిష్టంగా 25 వేల నుంచి 1.20 లక్షల వరకూ తగ్గింపు లభిస్తోంది. టాటా నెక్సాన్ ఈవీ అన్ని మోడల్ కార్ల ధరలపై టాటా మోటార్స్ సంస్థ డిస్కౌంట్ అందిస్తోంది. టాటా మోటార్స్ సంస్థతో పాటు ఎంజీ మోటార్స్ కూడా కొన్ని మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఎంజీ మోటార్స్ తన కామెట్ ఈవీ మోడల్‌పై ఏకంగా లక్ష రూపాయలు తగ్గించింది. ఎంజీ కామెట్ ఈవీ ధర ఇప్పుడు 6.99 లక్షల రూపాయలకు లభిస్తోంది.
Also read: AP Elections 2024: ఎన్నికల విధుల్లో సచివాలయ ఉద్యోగులు, ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook