Multibagger Stocks: రూ. 65 నుంచి రూ. 560 కి పెరిగిన స్టాక్ ధర
Tata Motors Stock becomes Multibagger Stock: కేవలం గత 6 నెలల్లోనే టాటా మోటార్స్ షేర్ వ్యాల్యూ 48% పెరిగింది. టాటా మోటార్స్ 2022 - 23 ఆర్ధిక సంవత్సరం 4వ త్రైమాసికం అయిన జనవరి నుండి మార్చి క్వార్టర్‌లో రూ. 5,408 కోట్ల నెట్ ప్రాఫిట్ సంపాదించినట్టుగా కంపెనీ వెల్లడించింది.
Tata Motors Stock becomes Multibagger Stock: టాటా గ్రూప్‌కి చెందిన ఒక స్టాక్ గత మూడేళ్లలో ఇన్వెస్టర్స్‌కి భారీ లాభాలు సంపాదించిపెట్టి మల్టీబ్యాగర్ స్టాక్‌లా నిలిచింది. ఆ స్టాక్ మరేదో కాదు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ ట్రెండ్ పెరిగాకా నిత్యం స్టాక్ మార్కెట్ వార్తల్లో ఉంటూ వస్తోన్న టాటా మోటార్స్. టాటా మోటార్స్ స్టాక్ గత 3 సంవత్సరాల్లో 100 కాదు 200 కాదు.. ఏకంగా 761.54 శాతం లాభాలు సంపాదించి పెట్టి సాహో అనిపించుకుంది. స్టాక్ మార్కెట్ కోవిడ్-19 సంక్షోభంలో చిక్కుకున్న సమయంలో ఏప్రిల్ 3, 2020 న టాటా మోటార్స్‌కి చెందిన ఒక్కో షేర్ ధర రూ. 65.30 కి పడిపోయింది. కానీ ఆ తరువాత.. అంటే ఏప్రిల్ 3, 2020 నుండి జూన్ 23, 2023 వరకు, టాటా మోటార్స్ స్టాక్ రూ. 560 కి పెరిగి 761.54 % లాభాలు అందించింది.
కేవలం గత 6 నెలల్లోనే టాటా మోటార్స్ షేర్ వ్యాల్యూ 48% పెరిగింది. టాటా మోటార్స్ 2022 - 23 ఆర్ధిక సంవత్సరం 4వ త్రైమాసికం అయిన జనవరి నుండి మార్చి క్వార్టర్‌లో రూ. 5,408 కోట్ల నెట్ ప్రాఫిట్ సంపాదించినట్టుగా కంపెనీ వెల్లడించింది.
టాటా మోటార్స్ భారీ మొత్తంలో లాభాలు చవిచూడటంతో, దాదాపు 7 సంవత్సరాల తర్వాత టాటా మోటార్స్ కంపెనీ తొలిసారి డివిడెండ్‌ని అందించనున్నట్టు ప్రకటించింది. మే 12, 2023న 100 % ఫైనల్ డివిడెండ్‌ను సిఫార్సు చేస్తూ టాటా మోటార్స్ ఓ ప్రకటన చేసింది. ఇది టాటా మోటార్స్ షేర్లలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్స్‌కి మరింత గుడ్ న్యూస్‌గా మారింది.
2023 లో టాటా మోటార్స్ డివిడెండ్ :
2023 లో టాటా మోటార్స్ డివిడెండ్ విషయానికొస్తే.., బిఎస్‌ఇ ఫైలింగ్‌లో కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పేర్కొన్న వివరాల ప్రకారం ప్రతీ సాధారణ షేరుకు రూ. 2 చొప్పున ఫైనల్ డివిడెండ్ రూ. 2 ప్రకటించాలని సిఫార్సు చేస్తున్నట్టు తెలిపారు. మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో 'A' ఆర్డినరీ షేర్‌కు రూ. 2.10 మేర చెల్లించాలని యాన్వల్ జనరల్ మీటింగ్‌లో నిర్ణయించుకున్నట్టుగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కి ఇచ్చిన ఫైలింగ్స్‌లో పేర్కొన్నారు. అర్హులైన షేర్‌హోల్డర్స్‌కి ఆగస్ట్ 14, 2023 నుండి డివిడెండ్స్ చెల్లించనున్నట్టు టాటా మోటార్స్ కంపెనీ స్పష్టంచేసింది.
డివిడెండ్ రికార్డ్ తేదీ :
డివిడెండ్ రికార్డ్ తేదీ విషయానికొస్తే.. మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి టాటా మోటార్స్ కంపెనీ ప్రకటించిన ఫైనల్ డివిడెండ్‌ను పొందాలంటే 29 జూలై 2023 శనివారం నాటికి షేర్ మార్కెట్ ఇన్వెస్టర్స్ ఖాతాలో టాటా మోటార్స్ షేర్స్ ఉండాల్సి ఉంటుంది.
టాటా మోటార్స్ చివరిసారిగా అందించిన డివిడెండ్ విషయానికొస్తే.. 2016లో మే 30న ఒక్కో ఈక్విటీ షేర్‌కు 0.20 చొప్పున అప్పట్లో డివిడెండ్‌ను అందించింది. టాటా మోటార్స్ ప్రస్తుత స్టాక్ మార్కెట్ ధరను పరిగణనలోకి తీసుకున్నట్టయితే.. ఇది 0.36% డివిడెండ్ రిటర్న్స్ కింద భావించాల్సి ఉంటుంది.
టాటా మోటార్స్ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పిబి బాలాజీ మీడియాతో మాట్లాడుతూ, కంపెనీలోని అన్ని విభాగాలు అద్భుతమైన పని తీరును కనబర్చడం వల్లే టాటా మోటార్స్ ఆల్-టైమ్ హై అచీవ్‌మెంట్ సాధించింది అని తెలిపారు. మార్కెట్ పరిస్థితులనుబట్టి చూస్తే.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో టాటా మోటార్స్ చాలా అగ్రెసివ్‌గా మూవ్ అవుతున్నందు వల్లే కంపెనీకి ఇంత భారీ స్థాయిలో లాభాలు రావడమే కాకుండా టాటా మోటార్స్ షేర్ వ్యాల్యూ కూడా భారీగా పెరుగుతూ వస్తోంది.