Tata Punch Vs Tata Nexon: టాటా కార్లు కొనుగోలు చేస్తున్నారా?..ఈ రెండింటి మధ్య తేడాలు తప్పకుండా తెలుసుకోండి..
Difference Between Tata Nexon And Tata Punch: ప్రస్తుతం మార్కెట్‌లో అధికంగా సేల్ అవుతున్న కార్లలో టాటా పంచ్ ఒకటి. అయితే ఈ కారు అమ్మకాలు నెక్సాన్‌తో పోటీ పడుతున్నాయి. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ కారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Difference Between Tata Nexon And Tata Punch: ఆటో మొబైల్ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో టాటా పంచ్ ఒకటి. ఇది అతి తక్కువ ధరలోనే ఎన్నో శక్తివంతమై ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అత్యధునిక భద్రతతో లభిస్తోంది. ప్రస్తుతం ఈ కారు అమ్మకాలు మార్కెట్‌లో నెక్సాన్ వేరియంట్‌తో పోటీపడుతోంది. అయితే ఈ రెండు కార్లు అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో లభిస్తున్నాయి. చాలా మంది ఈ రెండింటిలో ఏ కారు కొనుగోలు చేయాలో అని తికమక పడుతున్నారు. అయితే ఈ టాటా పంచ్, నెక్సాన్ మధ్య ఉన్న ప్రధాన తేడాలేంటో? ఈ రెండింటిలో ఏ కారు బెస్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టాటా పంచ్, నెక్సాన్ మధ్య 10 ముఖ్యమైన తేడాలు:
టాటా పంచ్, నెక్సాన్ మధ్య మధ్య ప్రధాన తేడాల విషయానికొస్తే..పంచ్ ఒక కాంపాక్ట్ SUV, కాబట్టి ఈ కారు చూడడానికి కాస్త చిన్నదిగా కనిపిస్తుంది. కాబట్టి పంచ్ పొడవు, వెడల్పు, ఎత్తులో నెక్సాన్ కంటే చిన్నదిగా ఉంటుంది. ఇక ఇంజన్ వివరాల్లోకి వెళితే పంచ్ కారు 1.2L పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. నెక్సాన్ మాత్రం 1.2L పెట్రోల్ ఇంజన్‌తో పాటు 1.5L డీజిల్ ఇంజన్‌తో లభిస్తోంది. నెక్సాన్ ఇంజన్లు పంచ్ కంటే ఎక్కువ శక్తివంతమైనది. అంతేకాకుండా చాలా టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఇక ఈ రెండు కార్ల అసలు ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, రెండు కార్లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ నెక్సాన్ కారులో ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ సీట్లుతో పాటు 360 డిగ్రీ కెమెరా వంటి అదనపు ఫీచర్స్ లభిస్తాయి. ఈ రెండు కార్ల భద్రత విషయానికొస్తే..వీటి రెండింటిలో డ్యూయల్ ఎయిర్ బ్యాగుల సిస్టమ్ అందుబాటులో ఉంది. దీంతో పాటు ABSతో EBD, ISOFIX చైల్డ్ సీట్ భద్రతా ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. ఇక నెక్సాన్‌లో మాత్రం అదనంగా 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ట్రాక్షన్ కంట్రోల్ వంటి ప్రీమియం ఫీచర్స్ లభిస్తున్నాయి.
టాటా పంచ్, నెక్సాన్ కార్ల ధర విషయానికొస్తే, పంచ్ కారు ధర బెసిక్ మోడల్ రూ.5.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక నెక్సాన్ మార్కెట్‌లో ధర రూ. 7.54 లక్షల నుంచి మొదలవుతుంది. పంచ్ ధర నెక్సాన్ కంటే ఎంతో తక్కువ. ఇక ఈ రెండు కార్ల ఫ్యూయల్ కెపాసిటీ విషయానికొస్తే, పంచ్ కారు పెట్రోల్ వెర్షన్ 18.97 kmpl వరకు మైలేజీని ఇస్తుందని సమాచారం. ఇక డీజిల్ వెర్షన్ మాత్రం 21.03 kmpl వరకు మైలేజీని ఇస్తుంది. నెక్సాన్ కారు పెట్రోల్ వెర్షన్ 16.05 kmpl వరకు, డీజిల్ వెర్షన్ 22.4 kmpl వరకు మైలేజీతో అందుబాటులోకి వచ్చింది. డిజైన్ పరంగా చూస్తే, పంచ్ కారు బాక్సీ డిజైన్ కలిగి ఉంటుంది. దీంతో పాటు నెక్సాన్ ఒక స్పోర్టీ డిజైన్‌తో లభిస్తోంది. ఇక ఈ రెండు కార్లలో ఏది బెస్ట్ అంటే..తక్కువ ధరతో మంచి కారును కొనుగోలు చేయాలనుకునేవారికి కాంపాక్ట్ SUV టాటా పంచ్ చాలా బెస్ట్. ప్రీమియం ఫీచర్స్ కావాలనుకునేవారికి నెక్సాన్ కారు మంచి ఎంపికగా భావించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి