Tata Free Offers: ఇంటర్నెట్ యూజర్లకు గుడ్‌న్యూస్. టాటా ప్లే ఫైబర్ అద్భుతమైన ఆఫర్ ప్రకటిస్తోంది. అపరిమితమైన డేటాను ఉచితంగానే అందించనున్నామని తెలిపింది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ టాటా ప్లే ఫైబర్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు ట్రై అండ్ బై స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ ప్రకారం అపరిమితమైన బ్రాండ్ బ్యాండ్ సౌకర్యాన్ని నెలరోజుల పాటు ఉచితంగా పొందవచ్చు. సర్వీస్ ఎలా ఉందో పరీక్షించి..ఆ పై కనెక్షన్ కొనుగోలు చేస్తే కొత్త ఆఫర్ పొందవచ్చని టాటా ప్లే ఫైబర్ వెల్లడించింది.


టాటా ప్లే ఫైబర్ సంస్థ ఇప్పుడు 1150 రూపాయల ప్లాన్‌లో 2 వందల ఎంబీబీఎస్ డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగంతో హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తోంది. కొత్త చందాదారులకు ఈ ప్లాన్ ఉచితంగా అందిస్తోంది. అయితే 15 వందల రూపాయల రిఫండెబుల్ సెక్యూరిటీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్కీమ్ ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, గ్రేటర్ నోయిడా, ముంబైలతో పాటు మరికొన్ని నగరాల్లో ఉంది. ట్రై అండ్ బై కస్టమర్లు వేయి జీబీ హై స్పీడ్ డేటాను ఉచితంగా పొందుతారు. చెల్లించిన సెక్యూరిటీ డబ్బుల్ని పూర్తిగా వెనక్కి పొందాలంటే.30 రోజుల్లోపే కనెక్షన్ రద్దు చేయాల్సి ఉంటుంది. అదే నెలరోజుల తరువాత రద్దు చేస్తే మాత్రం 5 వందల రూపాయలు ఛార్జ్ అవుతుంది. మిగిలిన వేయి రూపాయల్ని మాత్రమే పొందుతారు. 


ట్రై అండ్ బై ఆఫర్ ఎలా పొందాలి


ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు టాటా ప్లే ఫైబర్ (Tata Play Fibre) ట్రయల్ పీరియడ్‌లో వినియోగదారులకు ఉచితంగా ల్యాండ్‌లైన్ కనెక్షన్ లభిస్తుంది. మూడు నెలల ప్లాన్ అంటే 100 ఎంబీపీఎస్ ఎంచుకుంటే..15 వందల రూపాయలు రిఫండ్ పూర్తిగా లభిస్తుంది. అదే మూడు నెలల పాటు 50 ఎంబీపీఎస్ ప్లాన్ ఎంచుకుంటే మాత్రం 5 వందల రూపాయలే వాపసు పొందుతారు. మిగిలిన వేయి రూపాయలు వ్యాలెట్‌లో డిపాజిట్‌గా ఉంటుంది. నెల ప్లాన్‌ను మూడు నెలల పాటు తీసుకున్న తరువాత ఆ వేయి రూపాయలు వాపసు చెల్లించేస్తారు. 


Also read: RBI Interest Rates: ఆర్బీఐ చివరి త్రైమాసిక సమీక్షలో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook