Tata Punch iCNG: టాటా పంచ్ iCNG కారు వచ్చేసింది
![Tata Punch iCNG: టాటా పంచ్ iCNG కారు వచ్చేసింది Tata Punch iCNG: టాటా పంచ్ iCNG కారు వచ్చేసింది](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/styles/zm_500x286/public/2023/08/04/279727-tata-punch-icng-launched-in-india.jpg?itok=TMu7uE99)
Tata Punch iCNG Launched In India: టాటా మోటార్స్ కంపెనీ టాటా పంచ్ ఐసీఎన్జీ వేరియంట్ కారులో పలు అప్‌డేట్స్‌తో ఫీచర్స్‌ని అప్‌గ్రేడ్ చేసింది. టాటా పంచ్ ఐసీఎన్జీ అప్ డేట్స్ విషయానికొస్తే.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 84.82 bhp పవర్, 113 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే 3 సిలిండర్ ఇంజన్‌తో వస్తోంది.
Tata Punch iCNG Launched In India: ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా పంచ్ కారుకి సంబంధించి ఐసీఎన్జీ వెర్షన్ లాంచ్ అయింది. ఈ కారు బేసిక్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.10 లక్షల నుండి ప్రారంభమై టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.98 లక్షల వరకు ఒక్కే వేరియంట్‌కి ఒక్కో ధర ఉంది. ఈ సరికొత్త పవర్‌ట్రెయిన్ కారు ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్.. ఇలా మూడు వేరియంట్స్‌లో లభిస్తోంది. టాటా పంచ్ ఐసీఎన్జీతో పాటే టియాగో ఐసీఎన్జీ, టిగోర్ ఐసీఎన్జీ కార్లను కూడా అప్‌డేట్ చేసింది.
టాటా మోటార్స్ కంపెనీ టాటా పంచ్ ఐసీఎన్జీ వేరియంట్ కారులో పలు అప్‌డేట్స్‌తో ఫీచర్స్‌ని అప్‌గ్రేడ్ చేసింది. టాటా పంచ్ ఐసీఎన్జీ అప్‌డేట్స్ విషయానికొస్తే.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, 84.82 bhp పవర్, 113 Nm గరిష్ట టార్క్ ఉత్పత్తి చేసే 3 సిలిండర్ ఇంజన్‌తో వస్తోంది. టాటా పంచ్ సీఎన్జీ వెర్షన్ 75.94 bhp పవర్‌ని , 97 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ సీఎన్జీ పవర్‌ట్రెయిన్ వేరియంట్ కారు 5-స్పీడ్ ఆటోమేటిక్ మ్యాన్వల్ ట్రాన్స్‌మిషన్ గేర్ బాక్స్ సహాయంతో రన్ అవుతుంది.
మెరుగైన భద్రత కోసం పొటెన్షియల్ డ్యామేజీని తగ్గించే విధంగా లగేజీ కింది భాగంలో రెండు సిలిండర్స్ వాల్వ్‌స్, పైపులు వచ్చే విధంగా టాటా పంచ్ కారు సీఎన్జీ వెర్షన్‌ని అప్‌గ్రేడ్ చేశారు. అంతేకాకుండా, వెనుక నుంచి ఏదైనా వాహనం ఢీకొన్న ఘటనల్లో ప్రమాదం తీవ్రతను తగ్గించేలా వెనుక భాగంలో సీఎన్జీ ట్యాంక్స్ కోసం 6 పాయింట్ మౌంటింగ్ సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు.
60 కిలోల సింగిల్ సీఎన్జీ ఫ్యూయెల్ ఉండే స్థానంలో 30 కిలోల డ్యూయల్ సిలిండర్ ఉండేలా టాటా పంచ్ సీఎన్జీ కారుని డిజైన్ చేశారు. దీంతో ఈ కారు లుక్ కూడా మిగతా వాటికంటే భిన్నంగా కనిపిస్తుంది. ఆల్ఫా ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ కారులో సీఎన్జీ ఫ్యూయెల్ రీఫిల్ చేసే సమయంలో కారుని తాత్కాలికంగా స్విచ్ ఆఫ్‌లో చేసేలా మైక్రో-స్విచ్ ఏర్పాటు చేశారు. థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్ ఇంజన్‌కి సీఎన్జీ సరఫరాను నిలిపివేసి గ్యాస్‌ని బయటికి విడుదల చేస్తుంది. ప్రమాదాలను నివారించడానికి సీఎన్జీ కార్లలో కొత్తగా తీసుకొచ్చిన అప్‌డేట్ ఇది.
ఇది కూడా చదవండి : Hyundai Cars On Discount Sale: హ్యూందాయ్ కార్లపై రూ. 2 లక్షల వరకు తగ్గింపు
కారుపై కనిపించే iCNG అనే లోగో తప్పించి కారు ఎక్స్‌టీరియర్ డిజైన్ పరంగా పెద్దగా మార్పులు ఏమీ కనిపించవు. టాటా పంచ్ ఐసీఎన్జీ కారులో ఫీచర్ల విషయానికొస్తే.. వాయిస్ సూచనలతో ఆపరేట్ అయ్యే ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ సీట్ వద్ద రిలాక్స్‌గా చేయి పెట్టుకోవడానికి వీలుగా ఆర్మ్‌రెస్ట్, యూఎస్బీ టైప్ సి ఛార్జర్, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ ఉన్న 7 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు, కంఫర్టబుల్ డ్రైవింగ్ కోసం హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Most Highest Selling Car: ఇండియాలో ఇప్పటివరకు ఎక్కువగా అమ్ముడైన కారు ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి