Cheap And Best Sunroof Cars: తక్కువ ధరలో లభించే సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న కార్లు

Cheap And Best Sunroof Cars In India: కొత్త కారు కొనుగోలు చేసే వారిలో చాలామంది చెక్ చేస్తోన్న ఫీచర్లలో సన్ రూఫ్ ఫీచర్ కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా సన్‌రూఫ్ కార్లు భారీ సంఖ్యలో సేల్ అవుతుండటమే అందుకు నిదర్శనం. అయితే, ఒకప్పుడు ఈ సన్ రూఫ్ కార్లు కొనాలంటే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు తక్కువ ధరలోనే సన్‌రూఫ్ కార్లు వచ్చేస్తున్నాయి. 

Written by - Pavan | Last Updated : Jul 15, 2023, 08:17 AM IST
Cheap And Best Sunroof Cars: తక్కువ ధరలో లభించే సన్‌రూఫ్ ఫీచర్ ఉన్న కార్లు

Cheap And Best Sunroof Cars In India: సన్‌రూఫ్ కార్లకు ఇప్పుడు ఇండియాలో భారీ క్రేజ్ నెలకొని ఉంది. కారు తీసుకునే వారిలో చాలామంది చెక్ చేస్తోన్న ఫీచర్లలో సన్ రూఫ్ ఫీచర్ కూడా ఒకటి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా సన్‌రూఫ్ ఉన్న కార్ల డిమాండ్‌, సేల్స్‌లో కూడా భారీ పెరుగుదల కనిపిస్తుండటమే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు ఈ సన్ రూఫ్ కార్లు అంటే కొంత ఖరీదైన వ్యవహారం అనే పేరు ఉండేది. సన్ రూఫ్ కార్ల ఖరీదు ఎక్కువగా ఉండటమే కారణం. 

అయితే, రాన్రాను పోటీ పెరుగుతూ వస్తుండటంతో సన్ రూఫ్ ఫీచర్ కూడా తక్కువ ధరలోనే అందించేందుకు కార్ల తయారీ కంపెనీలు పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సరసమైన ధరలలో సన్‌రూఫ్ ఫీచర్‌తో లభించే కార్లు ఏమేం ఉన్నాయి, వాటి ఎక్స్‌షోరూం ధరలు ఎలా ఉన్నాయి అనే వివరాలపై ఓ లుక్కేద్దాం రండి.

హ్యూందాయ్ ఎక్స్‌టర్ కారు
జస్ట్ మొన్నటికి మొన్న.. అంటే జులై 10వ తేదీనే ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లోకి లాంచ్ అయిన హ్యూందాయ్ ఎక్స్‌టర్ కారు కూడా సన్ రూఫ్ ఫీచర్ తోనే వస్తోంది. హ్యూందాయ్ ఎక్స్‌టర్ కారు ఎక్స్‌షోరూం ఖరీదు కేవలం రూ. 5.99 లక్షలు మాత్రమే. సన్ రూఫ్ ఫీచర్‌తో వస్తోన్న కొత్త కార్లలో ఇదే అత్యంత చౌకయిన కారు.

టాటా ఆల్ట్రోజ్ కారు
హ్యూందాయ్ ఎక్స్‌టర్ తరువాత ఇంకాస్త ఎక్కువ ధరలో.. అంటే రూ. 6.60 లక్షల ఎక్స్‌షోరూం ధరలోనే టాటా ఆల్ట్రోజ్ కారు లభిస్తోంది. కస్టమర్లలో బాగా క్రేజ్ ఉన్న కార్లలో టాటా ఆల్ట్రోజ్ కారు కూడా ఒకటి అనే విషయం తెలిసిందే.

టాటా నెక్సాన్ కారు
టాటా నెక్సాన్ బేసిక్ వేరియంట్ కారు ఎక్స్‌షోరూం ధర రూ. 7.80 లక్షలు వద్ద ప్రారంభం అవుతోంది. టాటా నెక్సాన్ కారులోనూ సన్ రూఫ్ ఫీచర్ ఉంది. ఇండియాలో టాటా మోటార్స్ అధికంగా విక్రయిస్తున్న కార్లలో ఇది కూడా ఒకటి. 

మారుతి సుజుకి బ్రెజా కారు
ఇండియాలో మిగతా కాంపిటీటర్స్‌తో పోలిస్తే.. ఒకింత తక్కువ ధరలో కార్లు తయారు చేసి విక్రయించే మారుతి సుజుకి నుంచి వచ్చిన బ్రెజా కారులోనూ సన్ రూఫ్ ఫీచర్ ఉంది. ఈ కారు ఎక్స్‌షోరూం ధర 8.29 లక్షలుగా ఉంది.

మహింద్రా XUV300 
మార్కెట్లో మహింద్రా కార్లకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక మహింద్రా నుంచి తక్కువ ధరలో సన్‌రూఫ్ ఫీచర్‌తో వచ్చే కార్ల జాబితాను చెక్ చేస్తే.. ఇందులో సన్ రూఫ్ ఫీచర్ ఉన్న మహింద్రా XUV300 కారు కేవలం ఎక్స్‌షోరూం ధర రూ. 8.42 లక్షలుగా ఉంది.  

హ్యూందాయ్ వెర్నా
సెడాన్ కార్లలో హ్యూందాయ్ వెర్నా కారు లుక్కే వేరు. హ్యూందాయ్ వెర్నా కారు బేసిక్ వేరియంట్ ఎక్స్‌షోరూం ధర రూ. 10.90 లక్షలుగా ఉంది. హ్యూందాయ్ వెర్నా కారులోనూ సన్ రూఫ్ ఫీచర్ ఉంది.

ఇది కూడా చదవండి : Honda Dio 125 Scooter: స్మార్ట్ ఫీచర్స్‌తో లాంచ్ అయిన హోండా డియో 125 స్కూటర్.. ధర కూడా చాలా తక్కువే

ఎంజీ ఆస్టర్ కారు
ఇండియన్ మార్కెట్లో ఎంజీ కార్లకు ఒక భిన్నమైన క్రేజ్ ఉంది. ఎంజీ కార్లను ఇష్టపడే ఒక క్లాస్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎంజీ కార్ల జాబితాను పరిశీలిస్తే.. ఎంజీ ఆస్టర్ కారు రూ. 10.82 లక్షల ఎక్స్‌షోరూం ధరకు లభిస్తోంది. ఇందులో కూడా సన్ రూఫ్ ఫీచర్ ఉంది.

ఇది కూడా చదవండి : MG ZS EV SUV car: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ SUV కారు.. రన్నింగ్ కాస్ట్ కిమీకు 60 పైసలు మాత్రమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News