Hyundai Cars On Discount Sale: హ్యూందాయ్ కార్లపై రూ. 2 లక్షల వరకు తగ్గింపు

Hyundai Cars On Discount Sale: కొత్త కారు కొంటున్నారా ? ఏ కారుకి తక్కువ ధర ఉంది అని సెర్చ్ చేసే ఉంటారు కదా.. అయితే ఇదిగో ఈ హ్యూందాయ్ మోటార్స్ ఇండియా తీసుకొస్తున్న ఈ డిస్కౌంట్ మేళా మీ కోసమే. అవును, హ్యూందాయ్ మోటార్స్ ఇండియా వాళ్లు ఎంపిక చేసిన కార్లపై రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్స్ ఇస్తున్నారు. ఫుల్ డీటేల్స్ కోసం ఈ న్యూస్ చూడాల్సిందే. 

Written by - Pavan | Last Updated : Aug 4, 2023, 08:41 AM IST
Hyundai Cars On Discount Sale: హ్యూందాయ్ కార్లపై రూ. 2 లక్షల వరకు తగ్గింపు

Hyundai Cars On Discount Sale: హ్యూందాయ్ కంపెనీ ఆగస్టు నెలలో స్పెషల్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద హ్యూందాయ్ ఐ20, హ్యూందాయ్ ఐ20 N లైన్, హ్యూందాయ్ గ్రాండ్ i10 నియోస్, హ్యూందాయ్ ఆరా, హ్యూందాయ్ ఐ20 అల్కాజార్, హ్యూందాయ్ కోనా ఎలక్ట్రిక్ వంటి ఎంపిక చేసిన మోడల్ కార్లపై రూ. 2 లక్షల వరకు తగ్గింపు అందిస్తోంది. ఏయే కార్లపై ఎంత ఆఫర్ అందిస్తుందనేది ఇప్పుడు వివరంగా చూద్దాం.

హ్యూందాయ్ మోటార్స్ ఇండియా అందిస్తున్న ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ జోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్, గవర్నమెంట్ ఎంప్లాయిస్ బెనిఫిట్స్ అన్నీ కలుపుకుని ఈ ఆఫర్స్ వర్తిస్తాయి. 

హ్యూందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారు :
హ్యూందాయ్ కోనా ఎలక్ట్రిక్ కారుపై రూ. 2 లక్షలు తగ్గింపు అందిస్తోంది. జులై నెలలో రూ. 1 లక్ష వరకే తగ్గింపు ఆఫర్ ఉండగా.. ఈ ఆగస్టు నెలలో ఏకంగా మరొక లక్ష రూపాయలు పెంచి మొత్తం రూ. 2 లక్షల వరకు డిస్కౌంట్ బెనిఫిట్స్ ఇస్తున్నట్టు హ్యూందాయ్ ప్రకటించింది. ఇండియాలో హ్యూందాయ్ లాంచ్ చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ఇదే. 

హ్యూందాయ్ i20, హ్యూందాయ్ i20N లైన్ :
హ్యూందాయ్ నుండి వచ్చిన ప్రీమియం హ్యాచ్ బ్యాక్ కార్లలో ఎక్కువగా అమ్ముడయ్యే హ్యూందాయ్ i20, హ్యూందాయ్ i20N లైన్ మోడల్ కార్లపై హ్యూందాయ్ కంపెనీ రూ. 40 వేల వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులోనే క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ జోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్ వంటి అన్ని ఆర్థిక ప్రయోజనాలు ఉన్నట్టు కంపెనీ స్పష్టంచేసింది.

హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ : 
హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ కారుపై హ్యూందాయ్ కంపెనీ రూ. 43 వేల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్‌చేంజ్ జోనస్, కార్పొరేట్ బెనిఫిట్స్, గవర్నమెంట్ ఎంప్లాయిస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

హ్యూందాయ్ ఆరా కారు : 
హ్యూందాయ్ ఆరా అనే ఈ సెడాన్ కారుపై కంపెనీ రూ, 33,000 వరకు తగ్గింపు ఆఫర్స్ అందిస్తోంది. వైర్లెస్ ఫోన్ చార్జింగ్, పుష్ బటన్‌తో వచ్చిన స్మార్ట్ కీ, కీ‌లెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి అత్యాధునిక ఫీచర్స్ అన్నీ ఈ కారు సొంతం.

ఇది కూడా చదవండి : Most Highest Selling Car: ఇండియాలో ఇప్పటివరకు ఎక్కువగా అమ్ముడైన కారు ఇదే..

హ్యూందాయ్ అల్కాజార్ కారు :    
హ్యూందాయ్ అల్కాజార్ కారుపై హ్యూందాయ్ ఇండియా మోటార్స్ కంపెనీ ఈ ఆగస్టు నెలలో రూ. 20,000 వరకు తగ్గింపు అందిస్తోంది. హైట్ అడ్జస్ట్ చేసుకునే విధంగా ఉన్న ఈ SUV కారులో సీటింగ్ 6 నుండి 7 మంది వరకు కూర్చోవచ్చు. ఇదిలావుంటే, హ్యూందాయ్ క్రెటా, హ్యూందాయ్ వెన్యూ, హ్యూందాయ్ వెర్నా వంటి బెస్ట్ సెల్లింగ్ మోడల్ కార్లపై హ్యూందాయ్ డిస్కౌంట్స్ ఇవ్వకపోవడం గమనార్హం. కొత్త కొత్త కార్ల లాంచింగ్, వాటి ధరలు, మైలేజ్, ఫీచర్స్, ఇంజన్ ప్రత్యేకతలు.. ఇలా కార్లకు సంబంధించిన ఫుల్ రివ్యూల కోసం కీప్ రీడింగ్ జీ తెలుగు న్యూస్.

ఇది కూడా చదవండి : Lowest Safety Rating Cars: మీ కారు సేఫ్టీ రేటింగ్ ఎంత ? ఈ జాబితాలో మీ కారు ఉందేమో చూసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News