Here is Top 5 Reasons Why Peoples Buying Tata Punch: టాటా మోటార్స్ నుంచి వచ్చిన 'టాటా పంచ్' చాలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రజాదరణ పొందింది. ప్రస్తుతం పంచ్ కారు మైక్రో ఎస్‌యూవీ విభాగాన్ని శాసిస్తుంది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 కార్లలో పంచ్ ఒకటి. అంతేకాదు అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలో కూడా ముందువరుసలో ఉంది. ఈ కారు రిలీజ్ అయి దాదాపు ఏడాదిన్నర కావొస్తోంది. ఇంత తక్కువ సమయంలోనే ఎక్కువ అమ్మకాలను కలిగి ఉంది. జనాలు పంచ్‌ను అంతగా ఇష్టపడడానికి 5 కారణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Tata Punch Design:
చిన్న సైజులో ఉన్నా టాటా పంచ్ డిజైన్‌ని ప్రజలు ఇష్టపడుతున్నారు. టాటా కంపెనీ పంచ్‌ను చిన్న పరిమాణంలో రిలీజ్ చేసినా.. సూపర్ డిజైన్‌ను అందించింది. ఈ కారు పొడవు 3827mm, వెడల్పు 1742mm, ఎత్తు 1615mm, వీల్ బేస్ 2445mm మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 187mm. ఇది 366 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది.


Tata Punch Features:
టాటా పంచ్‌ చాలా ఫీచర్లును కలిగి ఉంది. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, పుష్-బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ AC, కూల్డ్ గ్లోవ్ బాక్స్, హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, iRA కనెక్ట్ చేయబడిన కార్ టెక్, 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్‌ల వంటి ఫీచర్లు ఉన్నాయి.


Tata Punch Safety:
టాటా పంచ్‌ ALFA-ARC ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి వస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ చాలా సేఫ్టీని ఇస్తుంది. గ్లోబల్ NCAP పంచ్‌ ఆక్యుపెన్సీకి 5-స్టార్ రేటింగ్‌ను ఇచ్చింది. పిల్లల భద్రత కోసం 4-స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఇది రివర్స్ పార్కింగ్ కెమెరా, కార్నరింగ్ ల్యాంప్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు మరియు ISOFIX చైల్డ్ మౌంట్‌లు వంటి లక్షణాలను కలిగి ఉంది.


Tata Punch Engine:
టాటా పంచ్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఎంపికతో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ (86 PS పవర్ మరియు 113 Nm టార్క్)ను కలిగి ఉంటుంది. లీటరుకు 18.97 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు. ఈ కారు CNG వెర్షన్ కూడా రాబోయే కాలంలో లాంచ్ చేయబడుతుంది. CNG మరింత మైలేజీని అందించగలదు.


Tata Punch Price:
టాటా పంచ్ ధర చాలా మందిని ఆకర్షిస్తుంది. పంచ్ ప్రారంభ ధర రూ. 6 లక్షలు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 9.54 లక్షల వరకు ఉంది.


Also Read: Best Electric Bikes: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 307 కిలోమీటర్ల ప్రయాణం.. భారత్‌లో టాప్ 3 బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు ఇవే!  


Also Read: Ben Stokes Injury Update: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌..చెన్నై తుది జట్టులోకి 16 కోట్ల ఆటగాడు! ప్లేయింగ్ 11 ఇదే  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.