Best Electric Bikes: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 307 కిలోమీటర్ల ప్రయాణం.. భారత్‌లో టాప్ 3 బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు ఇవే!

Here is List of Top 3 Best Electric Bikes in India 2023. దేశంలో మూడు అత్యంత రేంజ్ ఎలక్ట్రిక్ బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 307 కిలోమీటర్ల ప్రయాణం.   

Written by - P Sampath Kumar | Last Updated : Apr 21, 2023, 04:29 PM IST
Best Electric Bikes: ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 307 కిలోమీటర్ల ప్రయాణం.. భారత్‌లో టాప్ 3 బెస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లు ఇవే!

Best Electric Bikes in India 2023: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. రోడ్లపై ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా తిరుగుతున్నాయి. వినియోగదారులకు ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఎంపికలు మునుపటి కంటే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా టూ-వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో కస్టమర్లకు చాలా ఎంపికలు ఉన్నాయి. అయితే చాలా ఎంపికలు ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఉండగా.. ఎలక్ట్రిక్ బైక్‌లకు ఇప్పటికీ పరిమిత ఎంపికలే ఉన్నాయి. దేశంలో మూడు అత్యంత రేంజ్ ఎలక్ట్రిక్ బైక్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

Ultraviolette F77 Electric Bike:
బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ అల్ట్రావైలెట్‌ F77 పేరిట మొదటి ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను లాంచ్‌ చేసింది. స్టాండర్డ్‌, రెకాన్‌ వేరియంట్లలో ఈ బైక్‌ను తీసుకొచ్చింది. స్టాండర్డ్ వేరియంట్ 7.1kWh బ్యాటరీ ప్యాక్‌ని కలిగి ఉండగా.. దీని రేంజ్‌ 206 కిలోమీటర్ల వరకు ఉంటుంది. రీకాన్ వేరియంట్ 10.5kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండగా.. ఇది గరిష్టంగా 307 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి సుమారు 5 గంటలు పడుతుంది. బ్యాటరీపై 8 ఏళ్ల వారెంటీ ఇస్తోంది.

అల్ట్రావైలెట్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 KMPH వరకు దేసుకెళుతుంది. గరిష్ఠంగా 152 కిలోమీటర్లు వేగం వెళ్తుందని కంపెనీ పేర్కొంది. స్టాండర్డ్‌ వెర్షన్‌ 140 కిలోమీటర్లు వేగం, రెకాన్‌ వెర్షన్‌ గరిష్ఠంగా 147 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 3.80 లక్షలు కాగా.. రెకాన్‌ వేరియంట్ ధర రూ. 4.55 లక్షలు (ఎక్స్-షోరూమ్). లిమిటెడ్‌  ఎడిషన్ మోడల్‌ ధర రూ. 5.50 లక్షలు.

Komaki Ranger Electric Bike:
దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్ 'కొమాకి రేంజర్'. ఇందులో 3.6kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. ఈ బైక్ 200 నుంచి 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది. ఇందులో 4kW BLDC ఎలక్ట్రిక్ మోటార్ ఉండగా.. గరిష్ట వేగం 80 KMPH. బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి దాదాపు 4 గంటలు పడుతుంది. ఇందులో ఫాక్స్ ఎగ్జాస్ట్ సిస్టమ్ మరియు స్పీకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్ ధరరూ. 1.85 లక్షలు.

Oben Rorr Electric Bike:
ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ స్పోర్టీ లుక్ మరియు డిజైన్‌తో వస్తుంది. ఇందులో 4.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 187 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ బైక్ కేవలం 3 సెకన్లలో 0 నుంచి 40 kmph వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. ఈ బైక్ బ్యాటరీపూర్తిగా ఛార్జ్ కావడానికి 4 గంటలు పడుతుంది. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, థెఫ్ట్ ప్రొటెక్షన్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఒబెన్ రోర్ బైక్ ధర రూ. 1.50 లక్షలు.

Also Read: Ben Stokes Injury Update: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌..చెన్నై తుది జట్టులోకి 16 కోట్ల ఆటగాడు! ప్లేయింగ్ 11 ఇదే  

Also Read: CSK vs SRH IPL 2023: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఎంఎస్ ధోనీకి సూపర్ ట్రాక్ రికార్డ్.. మరీ ఇంతలా బాదాడా!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News