Tata Tiago EV Ofers 315 Km Range in Single Charging: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడమే ఇందుకు కారణం. ఇంధన ధరల కారణంగా ఎలక్ట్రిక్ కార్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఈ విభాగంలో 'టాటా మోటార్స్' ముందువరసలో ఉంది. టాటా మోటార్స్ ప్రస్తుతం టాటా నెక్సాన్, టాటా టిగోర్ మరియు టాటా టియాగో లాంటి అనేక ఎలక్ట్రిక్ కార్లను సేల్ చేస్తుంది. గత సంవత్సరం టాటా మోటార్స్ తన చౌకైన ఎలక్ట్రిక్ కారు టాటా టియాగోని విడుదల చేసింది. లుకింగ్, రేంజ్ కారణంగా ఇది వినియోగదారులకు బాగా నచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా టియాగో మార్కెట్లోకి వచ్చిన నాలుగు నెలల్లో ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌కు చెందిన 10,000 వాహనాలు డెలివరీ చేయబడ్డాయి. ప్రారంభించిన నాలుగు నెలల్లోనే ఈ ఫీట్‌ను సాధించిన అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ వాహనంగా అవతరించినట్లు కంపెనీ పేర్కొంది. ఇది మొదటి 24 గంటల్లో 10,000 బుకింగ్‌లను మరియు డిసెంబర్ 2022 నాటికి 20,000 బుకింగ్‌లను పొందిందని కంపెనీ ఓ ప్రకటనలో చెప్పింది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ. 8.69 లక్షల నుంచి మొదలవుతుంది. టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు 19.2kWh మరియు 24kWhలలో IP67 ఉన్న రెండు ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 


టాటా టియాగో 24kWh బ్యాటరీ ప్యాక్ పూర్తి ఛార్జ్‌పై 315 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది స్పోర్ట్స్ డ్రైవ్ మోడ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ కారు 5.7 సెకన్లలో 0 నుండి 60Kmph వేగంను అందుకుంటుంది. బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటారుపై టాటా కంపెనీ 8 సంవత్సరాలు / 1,60,000 కిమీల వారంటీని కూడా అందిస్తుంది. టాటా టియాగో ఈవీలో 4 ఛార్జింగ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. 7.2 KW ఛార్జర్‌తో దీన్ని 3.6 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది 15A పోర్టబుల్ ఛార్జర్‌తో 8.7 గంటల్లో 10 నుండి 100% వరకు ఛార్జ్ అవుతుంది. మరోవైపు DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 58 నిమిషాల్లో 10 నుండి 100% వరకు ఛార్జ్ చేయవచ్చు.


టాటా టియాగో ఈవీలో వినియోగదారులకు చాలా ఫీచర్లు టాటా కంపెనీ అందించింది. ఇందులో పూర్తిగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఫోల్డ్‌తో కూడిన ఎలక్ట్రిక్ ORVMలు, ఆటో హెడ్‌ల్యాంప్‌లు మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు ఉన్నాయి. ఇవి కాకుండా మరిన్ని ఫీచర్స్ కూడా టాటా టియాగో ఈవీలో ఉన్నాయి. 


Also Read: Rakul Preet Singh Bikini: బికినీలో రకుల్ ప్రీత్ సింగ్.. హాట్ అందాలతో మంచునే కరిగించేస్తుందిగా!   


Also Read: Yamaha RD350 Launch 2023: యమహా ఆర్‌డి 350 వచ్చేస్తుంది.. షాకింగ్ వివరాలు లీక్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.