Women employees: దేశంలో అత్యధిక మహిళా ఉద్యోగులున్న కంపెనీగా టీసీఎస్
Women Employs: మహిళా ఉద్యోగులు అత్యధికంగా ఉన్న దేశీయ కంపెనీగా టీసీఎస్ నిలిచింది. ఈ కంపెనీలో 1,78,357 మంది మహిళా ఉద్యోగులు ఉన్నట్లు ఓ నివేదికలో తేలింది. బ్యాంకింగ్ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో అత్యధిక మహిళా ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడైంది.
TCS have Highest Number Of Women employees In India: టాటా గ్రూప్‌కు చెందిన ప్రముఖ ఐటీ సేవల సంస్థ టీసీఎస్ (TCS).. మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలో అత్యధిక మంది మహిళా ఉద్యోగులు ఉన్న సంస్థగా టీసీఎస్ నిలిచింది. బుర్గిండి ప్రైవేట్ హరూన్ ఇండియా విడుదల చేసిన నివేదికలో (Burgundy private hurun india report) ఈ విషయం తెలిసింది.
కంపెనీలో మొత్తం (Employees in TCS) 5,06,908 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో 1,78,357 మంది మహిళలని (Women employees in TCS) నివేదిక పేర్కొంది.
దేశంలో టాప్ 500 కంపెనీల్లో.. 69 లక్షల మంది ఉద్యోగులు ఉన్నట్లు పేర్కొంది నివేదిక. ఒక్కో కంపెనీ సగటున 13,800 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపింది.
రెండో స్థానంలో ఇన్ఫోసిస్..
అత్యధిక మహిళా ఉద్యోగులు ఉన్న కంపెనీల జాబితాలో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో నిలిచింది. ఈ సంస్థలో మొత్తం 2,59,619 మంది ఉద్యోగులు ఉండగా.. అందులో 1,00,321 మంది మహిళలని (Women employees in Infosys) నివేదిక వివరించింది. ఆ తర్వాతి స్థానాల్లో విప్రో (72 వేలు) నిలిచింది.
మొత్తం ఉద్యోగుల పరంగా చూస్తే క్యూస్ కార్ప్ రెండో స్థానంలో ఉంది. ఈ సంస్థలో మొత్తం 3,63,136 మంది ఉండగా.. అందులో 61,733 మంది మహిళలు కావడం గమనార్హం.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో మొత్తం 2,36,334 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. అందులో మహిళల సంఖ్య 19,561గా (Women employees in Reliance industries) నివేదిక పేర్కొంది.
బ్యాంకింగ్ రంగంలో..
బ్యాంకింగ్ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో (Women employees in ICICI Bank) అత్యధికంగా 31,059 మహిళా ఉద్యోగులు ఉన్నారు. 21,746 మంది మహిళా ఉద్యోగులతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రెండో (Women employees in HDFC Bank) స్థానంలో నిలిచింది.
దేశీయంగా టాప్ 500 కంపెనీల్లో మొత్తం 644 మంది మహిళాలు.. ఆయా సంస్థల డైరెక్టర్ల బోర్డుల్లో సభ్యులుగా ఉన్నారు.
Also read: MedPlus IPO: రేపటి నుంచే మెడ్‌ప్లస్ ఐపీఓ- పూర్తి వివరాలు ఇవే..
Also read: Edible oil prices: మరింత తగ్గనున్న వంట నూనెల ధరలు!- కారణాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook