MedPlus Health Services Ltd’s initial public offer (IPO) will open for subscriptions on Monday: హైదరాబాద్‌కు చెందిన ఫార్మసీ రిటైల్ స్టోర్ల నిర్వహణ సంస్థ మెడ్‌ప్లస్ హెల్త్ సర్వీసెస్ లిమిటెడ్ (MedPlus IPO).. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు అంతా రేడీ అయ్యింది. రేపటి నుంచి (సోమవారం) ఐపీఓ ప్రారంభం కానుంది. షేర్లు సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు ఈ నెల 15 చివరి తేదీ.
నిధుల సమీకరణ లక్ష్యం ఇలా..
రూ.1,398 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఐపీఓకు వస్తోంది మెడ్‌ప్లస్. ఐపీఓలో ఒక్కో షేరు ధరను (MedPlus IPO share Price) రూ.780 నుంచి రూ.796 మధ్య ఉంచింది. షేరు ముఖ విలువ రూ.2 గా ఉంది.
ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ (18 షేర్లు) కొనేందుకు దరఖాస్తు (MedPlus IPO lat size) చేసుకోవాలి. లాట్ ధర రూ.14,040 నుంచి రూ.14,328 మధ్య ఉంటుంది.
ఐపీఓలో రూ.600 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేయనుంది కంపెనీ. దీనితో పాటు రూ.798 కోట్లను సమీకరకించేందుకు ఆఫర్ ఫర్ సేల్ (OFS) నిర్వహించింది. ఇప్పటికే సంబంధింత ప్రక్రియ పూర్తయింది.
ఉద్యోగులకోసం రూ.5 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్ చేసిది కంపెనీ. అర్హులైన ఉద్యోగులు ఎవరైతే ఐపీఓకు అప్లయి చేసుకుంటారో.. వారికి ఒక్కో షేరుపై రూ.78 వరకు రాయితీ లభించనుంది.
రన్నింగ్ మేనేజర్లుగా..
మెడ్‌ప్లస్ ఐపీఓకు యాక్సిస్ క్యాపిటల్, క్రెడిట్ సూయిస్ సెక్యూరిటీస్ (ఇండియా), ఎడిల్వైజ్ ఫినాన్షియల్ సర్వీసెస్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ (ఇండియా) వంటవి రన్నింగ్ మేనేజర్లుగా ఉన్నాయి.
నిధుల వినియోగం ఇలా..
ఐపీఓ ద్వారా సేకరించే నిధులను మూలధన అవసరాలకు వినియోగించుకోనున్నట్లు కంపెనీ ఇది వరకే వెల్లడించింది. సంస్థ విస్తరణ ప్రణాళికలకు ముఖ్యంగా 'ఆప్టివల్' కోసం ఈ నిధులను వినియోగించుకోనున్నట్లు తెలిపింది.
మెడ్‌ప్లస్‌కు దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2 వేలకు పైగా స్టోర్లు ఉన్నాయి. 150కిపైగా నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.
మెడ్‌ప్లస్ గురించి(About MedPlus)..
మెడ్‌ప్లస్ 2006లో ప్రారంభమైంది. గంగడి మధుకర్ రెడ్డి దీనిని స్థాపించారు. సంస్థలో ఇప్పుడు ఆయనకు 13.75 శాతం వాటా ఉంది. ఇందులో 24.58 శాతం వాటాతో లావెండర్ రోజ్ ఇన్వెస్ట్మెంట్ ప్రధాన స్టేక్ హోల్డర్‌గా ఉంది. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ ఔషధాలు విక్రయిస్తుంది ఈ సంస్థ.
2020-21 ఆర్థిక సంవత్సరంలో మెడ్‌ప్లస్ రూ.63.11 కోట్ల లాభాన్ని గడించింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం రూ.1.79 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనే రూ.66.36 కోట్ల లాభాన్ని నమోదు చేసిందని గణాంకాలు చెబుతున్నాయి.
Also read: Edible oil prices: మరింత తగ్గనున్న వంట నూనెల ధరలు!- కారణాలు ఇవే..
Also read: Gold Price Today: స్వల్పంగా పెరిగిన బంగారం, దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook