Elon Musk: స్పేస్‌ఎక్స్ , టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భవిష్యత్ వ్యాపారాల్ని అమలు చేయడంలో మహాదిట్ట. ఇప్పుడు కొత్తగా గిగా ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మిస్తారనేది అంశం వివాదంగా మారుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భవిష్యత్ అవసరాల్ని వ్యాపారంగా మార్చుకోవడంలో ఎలాన్ మస్క్ (Elon musk)సమర్ధుడు. భవిష్యత్ టెక్నాలజీ ఆధారంగా వ్యాపార ప్రణాళికలు రచిస్తుంటారు. ఇప్పుడు కొత్తగా గిగా ఫ్యాక్టరీ పేరుతో కొత్త కాన్సెప్ట్ పరిచయం చేశారు. ఇప్పుడా గిగా ఫ్యాక్టరీని ఎక్కడ నిర్మిస్తారనే అంశంపై వివాదం నెలకొంది. టెస్లా కంపెనీ(Tesla Company)తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి అమెరికాలో టెక్సాస్, జర్మనీలోని బెర్లిన్‌లో రెండు గిగా ఫ్యాక్టరీలు ఉన్నాయి. మూడవ ఫ్యాక్టరీ చైనాలోని షాంఘైలో నిర్మిస్తామని తెలిపారు. ఇదే సమయంలో రష్యా ప్రభుత్వంతో కూడా ఎలాన్ మస్క్ చర్చలు ప్రారంభించారు. చర్చలు సానుకూలంగా ముగిశాయని..త్వరలో గిగా ఫ్యాక్టరీ(Giga Factory) రష్యాలోని కోరోలెవ్‌లో నిర్మించనున్నట్టు అధికారులు చెప్పారు. రష్యాలో టెస్లా గిగా ఫ్యాక్టరీ ప్రకటన వెలువడి చాలాకాలమవుతున్నా..పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇదే విషయంపై ఓ ప్రశ్నించగా..ఇంకా ఎక్కడనేది నిర్ణయించలేదని చెప్పి వివాదం సృష్టించారు. ఏ విషయాన్ని అంత త్వరగా తేల్చకుండా వివాదం చేయడం ఆయనకు అలవాటు. ఇండియాలో టెస్లా కార్ల విషయంలో కూడా ఇదే జరిగింది. ఇండియాలో ఫ్యాక్టరీ నెలకొల్పితేనే ట్యాక్స్ తగ్గింపు విషయం పరిశీలిస్తామని ఇండియా గట్టిగానే సమాధానమిచ్చింది. అమెరికా, యూరప్ మార్కెట్ల కోసం ప్రస్తుతం ఉన్న గిగా ఫ్యాక్టరీల సామర్ధ్యాన్ని పెంచే యోచనలో టెస్లా కంపెనీ ఉందని తెలుస్తోంది. రష్యాలో నాలుగవ ఫ్యాక్టరీ విషయంలో నెలకొన్న అనిశ్చితికి కారణం..అదే ఫ్యాక్టరీని ప్రపంచంలో రెండవ అతిపెద్ద మార్కెట్ అయిన ఇండియాలో నెలకొల్పాలనుకున్నారా అనే వాదన కూడా మొదలైంది. 


Also read: Ravindranath Tagore: విశ్వకవి రవీంద్రుని ఇల్లు అమ్మకానికి. ధర ఎంతో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook