The cheapest Royal Enfield Hunter 350 motorcycle ever to hit the market: 2022లో రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) నుంచి డిఫరెంట్ స్టైల్స్ బైక్స్ రానున్నాయి. వచ్చే ఏడాది 4 నుంచి 5 దాకా కొత్త మోడల్స్ రానున్నాయి. అందులో ఒక మోడల్ కు సంబంధించిన లుక్‌ తాజాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ రిలీజ్ చేసిన వీడియోలో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ బైక్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 పేరుతో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది (Royal Enfield Hunter 350). 2022 ఫిబ్రవరిలో ఈ బైక్ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తన సరికొత్త స్క్రమ్ 411ని (Scrum 411) లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మంచుకొండల్లో, హిమాలయాల్లో అడ్వెంచర్ల‌ కోసం (Himalayan adventure motorcycle) కొన్ని బైక్స్ ను తీసుకురానుంది. 


రాయల్ ఎన్‌ఫీల్డ్ తాజాగా రాబోయే పలు బైక్స్ టెస్టింగ్‌లకు సంబంధించిన ఒక వీడియోను విడుదల చేసింది. అందులో 1:23 నిమిషాలు.. 1:31 నిమిషాల మధ్యలో హంటర్ ఆఫ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ లుక్ ఉంటుంది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ బైక్‌పై ఇప్పుడు చర్చ సాగుతోంది.



 


రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ దాదాపుగా రాయల్ ఎన్‌ఫీల్డ్ మెటోర్ 350 (Meteor 350 ) మాదిరిగానే రూపుదిద్దుకుంటోంది. దీని ఇంజన్ కూడా సేమ్ మెటోర్ 350 మాదిరిగానే ఉండనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350).. J-ఫ్లాట్‌ఫామ్‌తో 349 cc ఇంజిన్‌తో తయారవుతోంది. ఇది 22 Bhp పవర్‌‌ను కలిగి ఉంటుంది. అలాగే 27 Nm పీక్ టార్క్‌ ఉంటుంది. అలాగే 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ బైక్ రానుంది. 


Also Read : Scary Video: భయానికే భయం పుట్టించే వీడియో.. 20 అడుగుల పాము చిన్న పాప వైపు.. ఏం జరిగింది..?


ఈ కొత్త బైక్ కి.మీ ఫర్ అవర్ ప్రకారం.. 0-100 కి.మీ వేగాన్ని ఈజీగా అందుకోనుంది. ఇందంతా కూడా మనకు టెస్ట్ కనపడుతోంది. అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 350 సీసీతో వచ్చే ఈ హంటర్ బైక్ గురించి మనకు ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. కానీ మెటోర్ 350తో పోల్చితే ఈ కొత్త బైక్ బరువు చాలా తక్కువగా ఉండేలా తయారువతోంది. 


ఈ హంటర్ 350 బైక్ (Hunter 350).. సెమీ-డిజిటల్ కన్సోల్, ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌తో రానుంది. ఇంతకు ముందు అంటే 2021లో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మోడల్స్ లలో.. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 అలాగే హిమాలయన్‌ల మాదిరిగానే.. రాబోయే హంటర్ 350 బైక్ కూడా మంచి ఫీచర్స్ రానుంది. అట్రాక్టివ్‌గా ఉండనుందని తెలుస్తోంది. అయితే LED DRLలు, బ్లింకర్‌లు ఉండకపోచ్చు. 


రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్‌ను భారత మార్కెట్లోకి వదిలి.. పలు కంపెనీల కొత్త బైక్‌లకు పోటీ ఇవ్వనుంది. హోండా నుంచి వచ్చిన CB350RS బైక్‌కు (Honda CB350RS), అలాగే జావా స్టాండర్డ్ 300 (Jawa Standard 300), జావా ఫార్టీ టూ, బెనెల్లీ ఇంపీరియాల్‌లకు బైక్‌లకు ఇది పోటీగా నిలవనుంది. భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ.1.70 లక్షలుగా ఉంటుందని అంచనా.


Also Read : Viral Video: చేతిలో పిల్లాడు ఉన్నాడన్న కనికరం లేకుండా-చితక్కొట్టిన పోలీస్....


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook