Scary Video: భయానికే భయం పుట్టించే వీడియో..20 అడుగుల పాము చిన్న పాప వైపు.. ఏం జరిగింది..??

చిన్న పాప.. 20 అడుగుల పెద్ద అనకొండ ఆ పాప వైపువెళ్తుంది.. ఏం జరుగుతుంతో అనే టెన్షన్.. పాపకేం జరిగిందో వీడియోలో చూసేయండి మరీ!  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2021, 02:14 PM IST
  • చిన్న పాప వైపు దూసుకెళ్తున్న 20 అడుగుల పాము
  • దారికి అడ్డుగా వెళ్లిన చిన్న పాప.. ఏం జరిగింది
  • నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్న వీడియో
Scary Video: భయానికే భయం పుట్టించే వీడియో..20 అడుగుల పాము చిన్న పాప వైపు.. ఏం జరిగింది..??

 Girls Stops Pythons Path: ఇంటర్నెట్ ప్రపంచం..  ఇదొక అద్భుతమైన ప్రపంచం... అనేక అద్భుతమైన విషయాలతో, వీడియోలతో నిండి ఉంది. ప్రతిరోజూ మనల్ని ఆశ్చర్యపరిచే ఏదో ఒక వీడియో నెట్ లో ప్రత్యక్షమవుతూనే ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చే పాముల వీడియోలను నెటిజన్లు తెగ ఇష్టపడుతున్నారు.

అయితే ఈ రోజు మరో కొత్త వీడియో.. అది కూడా ఒక పాము వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే.. అదొక భారీ అనకొండ.. దాన్ని చూసి కూడా ఒక చిన్నారి భయపడకుండా అలానే కూర్చొని ఉంది. 

ఈ షాకింగ్ వీడియోను ఇప్పటి వరకి లక్షల మంది చూడగా.. తమకు నచ్చిన విధంగా నెటిజన్లు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: Ganguly on Kohli Captaincy: కెప్టెన్ గా కోహ్లీని అందుకే తొలగించాం: గంగూలీ

వీడియోలో చూసినట్లయితే.. దాదాపు ఇరవై అడుగుల పొడవున్న పెద్ద పైథాన్ ఒకటి పాకుతూ వెళ్లటం చూడవచ్చు. పాము వెళ్తున్న దారికి ఎదురుగా.. ఒకచిన్న పాప కూర్చొంది.. అటుగా పాము వెళ్తుంటే.. చూసే వారి మనసుకు తరువాతేమి జరగబోతుందని ఉత్కంఠ కలుగుతోంది. 

అదే స్థానంలో మనం ఉంటే.. ఊహించుకోండి మన పరిస్థితి.. అక్కడి నుండి పడిగెత్తటమో లేక అరవటమో లేదా గుండె ఆగిపోవటం కూడా జరగవచ్చు. కానీ ఆ పాప మాత్రం ఎలాంటి భయం లేకుండా.. పాము వెళ్లే దారికి అడ్డుగా వెళ్లి నిలబడింది.. కాసేపు ఆ పాము దారిని అడ్డగించి.. దాని తలను కూడా పట్టుకోవాలని ప్రయత్నించింది..

ఈ విషయం ఆశ్యర్యానికి గురి చేస్తుంటే.. మరో విషయం ఏమిటంటే.. ఆ పాము కూడా ఆ పాపను ఏమి అనకుండా.. మరో వైపుగా వెళ్లటం చూడవచ్చు. 

Also Read: రామగుండం రైల్వే స్టేషన్‌లో షాకింగ్ ఘటన.. అంతా చూస్తుండగానే రైలుకు ఎదురెళ్లి యువకుడి ఆత్మహత్య

చిన్నారి చిన్నారి పాము తలతో ఆడుకోవటం.. అంతేకాకుండా పామును మంచం లాగా, కుర్చీలాగా చేసుకొని దానిపైన పడుకోవటం మనం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. 

వీడియో చూడటానికే భయంగా ఉంది.. కానీ ఆ చిన్నారి మాత్రం.. పాముపై నృత్యం చేసే శ్రీ కృష్ణుడిలా కనిపిస్తుంది. ఇంత భయంకరంగా ఉన్న ఈ వీడియోను పాములంటే భయం ఉన్న వారు మాత్రం చూడకపోవటం మంచిది. ఈ వీడియో snake._.world అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేయగా.. నెట్టింట్లో తెగవైరల్ అవుతుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

https://bit.ly/3hDyh4GAndroid Link - 

  

Trending News