Bank Holidays: ఆర్థిక సంవత్సరంలో చివరి నెల అయిన మార్చిలో కూడా బ్యాంకులు, స్టాక్‌ మార్కెట్లకు కూడా భారీగా సెలవులు వచ్చాయి. తాజాగా మరో రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈనెలలో హిందూవులు, క్రైస్తవులకు సంబంధించిన ముఖ్యమైన పర్వదినాలు వస్తున్నాయి. ఆయా రోజుల్లో బ్యాంకులు, స్టాక్‌ మార్కెట్లు బంద్‌ కానున్నాయి. అంతర్జాతీయ, జాతీయ పండుగలు కావడంతో ఈ రెండు రోజులు ఆయా సంస్థలు మూసి ఉండనున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kavitha Arrest: కవితను అరెస్ట్‌ చేసి.. కేటీఆర్‌కు చుక్కలు చూపించిన ఈడీ అధికారిణి ఎవరో తెలుసా? ఆమె జీవిత చరిత్ర ఇదే!


 


భారత స్టాక్‌ మార్కెట్‌లో ఉన్న బాంబే స్టాక్‌ ఎక్చేంజ్‌ (బీఎస్‌ఈ), జాతీయ స్టాక్‌ ఎక్చేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) రెండు రోజుల పాటు కార్యకలాపాలు జరగవు. మార్చి 25వ తేదీన హోలీ పండుగ, మార్చి 29వ తేదీన క్రైస్తవులకు సంబంధించిన గుడ్‌ఫ్రైడ్‌ ఉంది. ఆయా రోజుల్లో స్టాక్‌ మార్కెట్లు మూతపడనున్నాయి. ఇక బ్యాంకింగ్‌ రంగంలో కూడా ఈ రెండు రోజులు ప్రభుత్వ రంగ బ్యాంకులు పని చేయవు. బ్యాంకు ఉద్యోగులకు హోలీ, గుడ్‌ఫ్రైడే సెలవులు ఉండనున్నాయి. ఆరోజు ఎలాంటి లావాదేవీలు కార్యాలయాలపరంగా జరగవు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి.

Also Read: Savings Scheme: తక్కువ చెల్లింపుతో దర్జాగా నెలకు రూ.5 వేలు పొందే అద్భుత పథకం


 


బ్యాంకులకు మాత్రం మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. మార్చి 23వ తేదీన నాలుగో శనివారం, 24న ఆదివారం, సోమవారం (25) హోలీ. దీంతో మూడు రోజుల పాటు వరుసగా బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా ఆర్థిక వ్యవస్థలో కీలకమైన బ్యాంక్‌లు, స్టాక్‌ మార్కెట్‌లకు భారీగా సెలవులు వచ్చాయి. ఏప్రిల్‌లో 2, మే, జూన్‌, జూలై, ఆగస్టు, అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌లో మాత్రం ఒక్కొక్క రోజు మాత్రమే సెలవులు వచ్చాయి. మిగతా నెలల్లో రెండు కన్నా ఎక్కువ సెలవులు ఉండే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter