బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరిగాయి. మరోవైపు మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పుంజుకుని షాకిస్తున్నాయి. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.60 మేర అతి స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,310కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.50 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,870 అయింది.



దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) నేడు పెరిగాయి. తాజాగా బంగారం ధర రూ.360 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,970కి చేరింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.190 పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.49,800కి పుంజుకుంది.



బులియన్ మార్కెట్‌లో మరోవైపు వెండి ధరలు (Silver Rate in India) అకాశాన్నంటుతున్నాయి. తాజాగా వెండి ధర రూ.890 మేర భారీగా పెరిగింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.63,800కి చేరింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe