బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) మళ్లీ పెరిగాయి. వెండి సైతం పసిడి బాటలోనే పయనించింది. వెండి భారీగా ధర పెరిగింది. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.470 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,850 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై రూ.430 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.48,450కి ఎగసింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) మిశ్రమంగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,350గా యథాతథంగా కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ. 500 మేర పెరగడంతో ధర రూ.49,400 అయింది.



బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) భారీగా పెరిగింది. తాజాగా వెండి ధర రూ.1,300 మేర భారీగా పెరిగింది. ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.62,000కి చేరింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది.



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe