Upcoming SUV Cars: దేశంలో క్యూ కట్టనున్న టాప్ ఎస్‌యూవీ కార్లు ఇవే
Upcoming SUV Cars: ఇటీవలి కాలంలో సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్ల కంటే ఎస్‌యూవీ కార్లకు క్రేజ్ పెరుగుతోంది. అందుకే దాదాపుగా అన్ని కంపెనీలు ఎస్‌యూవీలపై దృష్టి పెడుతున్నాయి. భారతీయ మార్కెట్‌లో కూడా ఎస్‌యూవీ వాటా 50 శాతం దాటింది.
Upcoming SUV Cars: దేశీయ మార్కెట్‌లో ఎస్‌యూవీ క్రేజ్ పెరుగుతోంది. టాటా మోటార్స్, హ్యుండయ్, మారుతి, కియా మోటార్స్, హోండా, మహీంద్రా ఇలా అన్ని కార్లు ఎస్‌యూవీలు లాంచ్ చేస్తున్నాయి. ఇప్పుడు త్వరలో 6 కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీలు ప్రవేశపెడుతున్నాయి.
స్కోడా, వోక్స్‌వేగన్
స్కోడా, వోక్స్‌వేగన్ కార్లు త్వరలో సబ్ 4 కాంపాక్ట్ ఎస్‌యూవీలు లాంచ్ చేయనున్నాయి. స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ వచ్చే ఏడాది మార్చ్ నెలలో మార్కెట్‌లో ఎంటర్ కానుది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ ప్రొడక్షన్ వెర్షన్ 2025లో ఇండియాలో జరిగే మొబిలిటీ షోలో ఉండవచ్చు.
హ్యుండయ్ వెన్యూ
2025లో హ్యుండయ్ వెన్యూ రెండో జనరేషన్ సిద్ధమౌతోంది. ప్రస్తుతం Q2Xi కోడ్ నేమ్‌తో పిలుస్తున్నారు. వచ్చే ఏడాది హ్యుండయ్ వెన్యూ డిజైన్, ఇంటీరియర్‌లో చాలా మార్పులు రావచ్చు.
టాటా నెక్సాన్
టాటా నెక్సాన్ సీఎన్‌జీ వెర్షన్ ఎస్‌యూవీ కారు ఈ ఏడాది చివర్లో అందుబాటులో రావచ్చు. దేశంలోనే మొట్టమొదటి టర్బో ఛార్జ్డ్ సీఎన్జీ కారు ఇది. దీని డిజైన్, ఎక్స్‌టీరియర్ లుక్స్ టాటా నెక్సాన్ ఐసీఐ వెర్షన్‌లానే ఉంటుంది.
కియో సిరోస్, క్లావిక్స్
కియా మోటార్స్ త్వరలో లాంచ్ చేయనున్న కొత్త మైక్రో ఎస్‌యూవీ పేరు కియా సిరోస్ లేదా కియా క్లావిక్స్. హ్యుండయ్ గ్రాండ్ ఐ10, టాటా పంచ్, మారుతి ఫ్రాంక్స్‌కు పోటీ ఇవ్వనుంది. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులో వెర్టికల్ పొజీషన్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్ ఉంటుంది.
నిస్సాన్ మాగ్నెట్
ఇండియాలో నాలుగేళ్ల తరువాత నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఈ ఏడాది చివర్లో లాంచ్ కావచ్చని తెలుస్తోంది. ఎక్స్‌టీరియర్-ఇంటీరియర్‌లో స్వల్ప మార్పులుంటాయి.
Also read: Vivo T2 Pro: ఫ్లిప్‌కార్ట్‌లో Vivo T2 Proపై భారీ డిస్కౌంట్, 6 వేల తగ్గింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook