Toyota Upcoming SUV: ఫార్చ్యూనర్ కంటే బలమైన ఎస్‌యూవీని తీసుకువస్తోన్న టయోటా.. శక్తివంతమైన ఇంజన్, సూపర్ మైలేజ్!
Toyota Working on 7 Seater SUV, Launching soon in India. టయోటా కంపెనీ తన పోర్ట్‌ఫోలియోకు మరో పెద్ద సైజ్ 7 సీటర్ ఎస్‌యూవీని జోడించాలని ప్లాన్ చేసింది. కొత్త మోడల్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది.
Toyota Plans to release 7 seater SUV in India: టయోటా కంపెనీ భారత మార్కెట్లో శక్తివంతమైన మరియు ఖరీదైన కార్లను విక్రయిస్తోంది. కంపెనీకి చెందిన చౌకైన కారు 'టయోటా గ్లాంజా'. ఇన్నోవా మరియు ఫార్చ్యూనర్ వంటి కార్లు టయోటా పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయి. శక్తివంతమైన రూపం మరియు అద్భుతమైన పనితీరుకు 'టయోటా ఫార్చ్యూనర్' ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు కంపెనీ తన పోర్ట్‌ఫోలియోకు మరో పెద్ద సైజ్ 7 సీటర్ ఎస్‌యూవీని జోడించాలని ప్లాన్ చేసింది. కొత్త మోడల్ ప్రస్తుతం అభివృద్ధిలో ఉంది. ఆ కారు ధర మరియు పరిమాణం పరంగా హ్యుందాయ్ టక్సన్ మరియు జీప్ మెరిడియన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
కొత్త 7-సీటర్ టయోటా ఎస్‌యూవీ (Toyota New Launch 7 seater 2023) యొక్క వీల్‌బేస్ 2,640mm ఉంటుంది. దీని కారణంగా మూడు వరుసల సీట్లు ఉన్నా కూడా చాలా స్థలం ఉంటుంది. దాంతో ప్రయాణీకులు మంచిగా కోర్చోవచ్చు. ఇన్నోవా హైక్రాస్ మాదిరిగానే ఈ టయోటా కొత్త ఎస్‌యూవీ ఫ్లాట్ ఫోల్డబుల్ సీట్లతో రానుంది. కార్‌మేకర్ రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియా మరియు ఎలక్ట్రికల్‌గా పనిచేసే టెయిల్‌గేట్‌తో పొడవైన వెనుక తలుపులను కలిగి ఉంటుంది.
కొత్త టయోటా 7-సీటర్ ఎస్‌యూవీ (Upcoming Toyota Cars) కంపెనీ యొక్క TNGA-C ప్లాట్‌ఫారమ్‌లో రూపొందించబడుతుంది. ఇది ఇన్నోవా హైక్రాస్‌లో కూడా కనిపిస్తుంది. తమ TNGA-ఆధారిత కార్లు మిగిలిన వాటితో పోల్చితే.. అతి తక్కువ గురుత్వాకర్షణ కేంద్రాన్ని మరియు మెరుగైన నిర్వహణను కలిగి ఉంటాయయి. కొత్త ఎస్‌యూవీ కంపెనీ ప్రస్తుత కార్ల కంటే 30-65 శాతం బలంగా మరియు 25 శాతం మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
కొత్త టయోటా (Toyota New SUV) 7-సీటర్ ఎస్‌యూవీ.. ఇన్నోవా హైక్రాస్‌లో ఉండే పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంటుందట. ఇందులో 2.0L, 4-సిలిండర్ హైబ్రిడ్ మరియు 2.0L పెట్రోల్ ఇంజన్ ఉండే అవకాశం ఉంది. హైబ్రిడ్ వెర్షన్ ఇ-డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. పెట్రోల్ మోడల్ సివిటి గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ 23.24 కిమీ/లీ ఇంధనాన్ని అందిస్తుందని టయోటా తెలిపింది. జపనీస్ వాహన తయారీ సంస్థ మరిన్ని సి మరియు డి విభాగాలను భారత దేశానికి తీసుకురానుంది. ఈ సంవత్సరం కంపెనీ మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఆధారంగా కూపే ఎస్‌యూవీని పరిచయం చేయనున్నట్లు సమాచారం.
Also Read: 12 లక్షల హ్యుందాయ్ క్రెటాను కేవలం 2 లక్షలకే ఇంటికి తీసుకెళ్లండి.. పూర్తి వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.