Toyota Urban Cruiser: అన్ని కంపెనీల SUVలకు పోటీనిచ్చే Toyota Urban Cruiser చౌక ధరలోనే రాబోతోంది..ఫీచర్స్ వివరాలు ఇవే!
New Toyota Urban Cruiser Price: త్వరలోనే మార్కెట్‌లోకి అర్బన్ క్రూయిజర్ టేజర్ SUV కారు లాంచ్ కాబోతోంది. ఈ కారు ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ SUV కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
New Toyota Urban Cruiser Price: మార్కెట్‌లో ఆటో మొబైల్ కంపెనీ టయోటాకి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా మారుతీ సుజుకీతో భాగస్వామ్యం చేసుకున్న తర్వాత ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియో మరింత దృఢంగా మారింది. అయితే ఈ రెండు కంపెనీ భాగస్వామ్యంతో గత ఏడాది అర్బన్ క్రూయిజర్ టేజర్ పేరును ట్రేడ్‌మార్క్ సెట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఈ SUV కారుపై భారీగా అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల తర్వాత వచ్చే నెల 3వ తేదిన మార్కెట్‌లోకి రాబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇది బ్రెజ్జా లాంటి డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ కారు మొత్తం 6 వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీ మోడల్‌లో కూడా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే లాంచింగ్‌కి ముందే ఈ కారుకి సంబంధించిన ధర వివరాలు కూడా లీక్ అయ్యాయి.
భారత మార్కెట్‌లో ఈ అర్బన్ క్రూయిజర్ టేజర్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.7,60,000 నుంచి ప్రారభమయ్యే ఛాన్స్ ఉంది. ఈ కారు మార్కెట్‌లోకి లాంచ్ అయితే మారుతీ బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూతో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ 4 మీటర్ SUVను బ్రెజ్జా ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తీసుకుని లాంచ్ చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఇలా మార్కెట్‌లోకి విడుదలైతే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కేటగిరీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ అర్బన్ క్రూయిజర్ లాంచ్ చేసి మార్కెట్‌లో మళ్లీ సంచలనం సృష్టించబోతోంది.
ఇంటీరియర్ వివరాలు:
ఈ అర్బన్ క్రూయిజర్ టేజర్ SUV టయోటా, సుజుకి భాగస్వామ్యంతో అందుబాటులోకి రాబోతోంది. కాబట్టి ఇంటీరియర్ పరంగా చాలా ప్రీమియంతో మార్కెట్‌లోకి రానుంది. ఈ కారు బాలెనో, గ్లాంజా, విటారా బ్రెజ్జా ఇంటీరియర్ కంటే ఎంతో ప్రీమియం క్వాలిటీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కారు లోపలి ముందు భాగంలో 9-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆర్కామిస్ సౌండ్ సిస్టమ్, వివిధ రకాల కనెక్టివిటీ ఫంక్షన్స్ సెటప్‌తో కస్టమర్స్‌కి లభించనుంది. అలాగే రియర్ ఎసి వెంట్‌తో పాటు పుష్-బటన్ స్టార్ట్ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా కీలెస్ ఎంట్రీ వంటి ప్రీమియం ఫీచర్స్ కూడా లభించనున్నాయి.
ఇంజన్, సేఫ్టీ ఫీచర్ల వివరాలు:
ఇంజన్:
1.5L K-సిరీస్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్
105 PS శక్తి @6,000 RPM
138 Nm టార్క్ @ 4,400 RPM
5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
సేఫ్టీ ఫీచర్లు:
డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు
ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)తో EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)
ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు
రియర్ పార్కింగ్ సెన్సార్లు
స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్‌లు
ఇమ్మోబిలైజర్
సెంట్రల్ లాకింగ్
అదనపు సేఫ్టీ ఫీచర్లు (టాప్ వేరియంట్‌లో):
సైడ్ ఎయిర్‌బ్యాగులు
కర్టెన్ ఎయిర్‌బ్యాగులు
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC)
హిల్ అసిస్ట్ కంట్రోల్ (HAC)
ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి