Microsoft Edge: మైక్రోసాఫ్ట్‌ సంస్థ ఎడ్జ్ బ్రౌజర్‌లో వినియోగదారులకు రెండు సరికొత్త  ఫీచర్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వెబ్‌సైట్లలో కంటెంట్‌ను సులువుగా కాపీ చేసేందుకు, ముఖ్యంగా అక్షర దోషాలను సరిదిద్దేందుకు వెబ్‌ సెలక్ట్‌, మైక్రోసాఫ్ట్‌ ఎడిటర్‌ పేరుతో ఈ ఫీచర్లను వినియోగదారుల మందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్లు ఎలా పనిచేస్తాయో తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మైక్రోసాప్ట్‌ ఎడిటర్‌..
ఈ ఫీచర్‌ అనేది అక్షరదోషం (స్పెల్లింగ్ మిస్టేక్స్), విరామ చిహ్నాలను చెక్‌ చేయడానికి ఉపయోగపడుతుంది సంస్థ తెలిపింది. అలాగే మనం రాసే వచనాన్ని మెరుగుపరచటానికి కొన్ని సూచనలను కూడా అందిచడంలో కీలక పాత్ర పోషిస్తుంది మైక్రోసాప్ట్‌ ఎడిటర్‌. ఇది 20కి పైగా భాషల్లో అందుబాటులో ఉంది అధికారికంగా మైక్రోసాప్ట్‌ వెల్లడించింది.అయితే మైక్రోసాప్ట్‌ ఎడిటర్‌ బ్రౌజర్‌లో ఉపయోగించే ప్రధాన భాషలో మాత్రమే పనిచేస్తుందని సంస్థ తెలిపింది. మైక్రోసాఫ్ట్‌ త్వరలో  కొన్ని మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇంగ్లీష్, ఫ్రెంచ్,స్పానిష్, ఇటాలియన్‌, పోర్చుగీస్ భాషల్లోనూ గ్రామర్‌ కరెక్షన్స్‌ చేయడానికి టెక్ట్స్‌ ప్రిడిక్షన్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త ఫీచర్‌ సాయంతో ఎడిటర్ ఎక్స్‌టెన్షన్‌ను విడిగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండకుండా నేరుగా వినియోగించుకునేటట్లు ఏర్పాటు చేసింది.


వెబ్‌ సెలక్ట్‌..
ఈ కొత్త ఫీచర్‌ వెబ్‌ నుంచి టెక్ట్స్‌ను సులువుగా కాపీ చేయడానికి వెబ్‌ సెలక్ట్‌ను తీసుకువస్తోంది మైక్రోసాఫ్ట్‌. ఈ వెబ్‌ సెలక్ట్‌తో టేబుల్స్‌, ఇమేజ్స్‌, టెక్ట్స్‌ను మనకు కావాలసిన ఫార్మాట్‌లో ఎంచుకోవడం సులభతరం అవుతుందని సంస్థ తెలిపింది. దీంతో వెబ్‌ సైట్లలోని మొత్తం పేరాగ్రాఫ్‌లను ఒరిజినల్‌ ఫార్మాట్‌లో సెలక్ట్‌ చేసుకొని కాపీ చేసుకోవడానికి వెబ్‌ సెలక్ట్‌ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్‌కు ఓ ప్రత్యేకత ఉంది. కంటెంట్‌ను దాని అసలు ఫార్మాట్‌లో పేస్ట్‌ చేసుకోవడం కోసం ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. అయితే మైక్రోసాఫ్ట్‌ సంస్థ  తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ల కోసం ఎడ్జ్‌ బ్రౌజర్‌లో టాప్‌లో కూడివైపున మూడు డాట్‌లతో కూడిన మెనూ కనిపిస్తుంది. దాన్ని టచ్‌ చేసి హెల్ప్‌ అండ్‌ ఫీడ్‌ బ్యాక్‌లోకి వెళ్లి అబౌట్‌ మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ను సెలెక్ట్‌ చేసుకోని ఈ కొత్త వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి.


Also Read: Janhvi Kapoor Photos: షైనింగ్ డ్రస్సులో వజ్రంలా మెరిసిపోతున్న నటి జాన్వీ కపూర్!


Also Read: Sai Pallavi Farming: కూలీగా మారిన 'శ్యామ్ సింగరాయ్' మూవీ హీరోయిన్ - ఫొటోలు వైరల్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook