ఆధార్ కార్డు..ప్రస్తుతం ప్రతి పనికీ ఆధారమైపోయింది. అందుకే ఎప్పుడూ అప్‌డేట్‌లో ఉండాలి. యూఐడీఏఐ ఇప్పుడు ఆధార్ విషయంలో కీలక సూచనలు జారీ చేసింది. మీ కార్డు జారీ చేసి పదేళ్లు పూర్తయితే అప్‌డేట్ చేయాలనే వార్తలు వ్యాపిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడిచిన కొన్నేళ్లుగా ఆధార్ కార్డు అనేది ఓ అత్యవసర డాక్యుమెంట్‌గా మారింది. దేశ పౌరులకు ఇదొక విశిష్టమైన గుర్తింపు పత్రంగా ఉంది. ప్రభుత్వ పథకాలు, సేవలు పొందేందుకు ఆధార్ తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలో ఆధార్ కార్డు జారీ అయి పదేళ్లు దాటితే..ఒక్కసారి కూడా అప్‌డేట్ కాకపోతే..వెంటనే అప్‌డేట్ చేయించాల్సి ఉంది. లేకపోతే వ్యాలిడిటీ కోల్పోయే ప్రమాదముందనే వార్తలు మీడియలో వస్తున్నాయి.


ఆధార్ అప్‌డేట్ అవసరమా కాదా


ఆధార్ అప్‌డేట్ విషయం తెలిసినప్పటి నుంచి వివిధ రకాలుగా విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ అంశం ట్రెండ్ అవుతోంది. అందుకే యూఐడీఏఐతో పాటు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. యూఐడీఏఐ జారీ చేసిన వివరాల ప్రకారం ఆధార్ అప్‌డేట్ చేయించడం అవసరం లేదు. తమ తమ డాక్యుమెంట్లను ఆధార్‌లో అప్‌డేట్ చేయాలనే వార్తల్ని కొట్టిపారేసింది.


పదేళ్లు దాటితే అప్‌డేట్ చేయడం


ఆధార్ కార్డు అప్‌డేట్ చేయించాలా వద్దా అనేది తప్పనిసరి కాదు. పదేళ్లు దాటి ఉంటే అప్‌డేట్ చేయించుకోవచ్చు. ఆధార్ సంబంధిత డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయించడం వల్ల అవసరమైన పనుల విషయంలో సౌలభ్యం లభిస్తుంది. అంతే తప్ప ఇది తప్పనిసరి ప్రక్రియ కానే కాదు.


Also read: Car Loans Interest Rates: కారు కొనాలనుకుంటున్నారా ? ఐతే ఈ డీటేల్స్ మీ కోసమే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook