Aamir khan: ఇప్పటికే 22 ఇళ్లు .. మరో లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేసిన అమీర్ ఖాన్.. ధర ఎంతో తెలుసా..?


Aamir Khan Laxury apartment: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ మరో లగ్జరీ అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు.ఈ భవంతి ముంబైలోని బాంద్రాలో ఉన్నట్లు తెలుస్తోంది. 
 

1 /7

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మరోసారి వార్తలలో నిలిచారు. ఇప్పటికే ఆయన పలుచోట్ల సొంత ఇళ్లను కొనుగోలు చేశారు. ఇటీవల అమీర్ ఖాన్ కూతురు.. ఇరాఖాన్ తన జిమ్ ట్రైనర్  శిఖరేను పెళ్లి చేసుకున్నారు. ముంబైలో జరిగిన స్టార్-స్టడెడ్ లో జరిగిన వేడుకకు దగ్గరి బంధువులు, స్నేహితుల మధ్య పెళ్లి వేడుక గ్రాండ్ గా జరిగింది.  

2 /7

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కు ఇప్పటికే అనేక చోట్ల ప్రాపర్టీలు, భవంతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. ముంబై, పంచగనిలో ఇప్పటికే అనేక ఇళ్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. అమీర్ ఖాన్ నికర విలువ 225 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే రూ.1,780 కోట్లు. అమీర్ ఖాన్..నటుడిగాను, దర్శకుడు, చిత్రనిర్మాత, టెలివిజన్‌లో టాక్-షో హోస్ట్ గాను బాగా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

3 /7

ఇటీవల ప్రముఖ తన జీవిత భాగస్వామితో కిరణ్ రావుతో తన 15 సంవత్సరాల వివాహబంధానికి ముగింపు పలికారు.కానీ బాలీవుడ్ లో అమీర్ ఖాన్, కిరణ్ రావులకు మంచి క్రేజ్ ఉంది. అమీర్ ఖాన్ రియల్ ఎస్టేట్ రంగంలోపై ప్రత్యేకంగా తనకంటూ ఆసక్తిని చూపిస్తుంటారు. అమీర్ ఖాన్  గతంలో ముంబైలోని కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో, ప్రత్యేకంగా శాంటాక్రూజ్ వెస్ట్‌లోని ఎస్‌వి రోడ్‌లోని ప్రైమ్ ప్లాజా భవనంలో రూ.35 కోట్లు పెట్టుబడి పెట్టారు. 

4 /7

ఇక ఇటీవల ముంబైలోని బాంద్రాలో మరో ఇల్లును అమీర్ ఖాన్ కొనుగోలు చేశారు. అమీర్ ఖాన్ ఇల్లు బాంద్రాలోని పాలి హిల్‌లో విలాసవంతమైన అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశారు. ఇవే కాకుండా.. స్టార్‌కి మెరీనాలో కూడా మరో రెండు అపార్ట్‌మెంట్లు, బెల్లా విస్టాలో ఒక అపార్ట్‌మెంట్ ఉంది. తాజాగా కొన్న ఇల్లు..అమీర్ ఖాన్ ఇంటి చిరునామా మెరీనా అపార్ట్‌మెంట్స్, పాలి హిల్, బాంద్రా, ముంబై ఉంది.

5 /7

మరోవైపు.. ఈ అపార్ట్ మెంట్..1027 చదరపు అడుగుల కార్పెట్‌ ఏరియాతో ఉన్నఆ ఇంటిని అమీర్ ఖాన్ రూ. 9.75 కోట్లకు జూన్‌ 25న కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల ద్వారా తెలుస్తోంది. ఇందుకు గాను రూ. 58.5 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30వేలు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించిన‌ట్లు సమాచారం.

6 /7

మహారాష్ట్రలోని పంచగనిలో కూడా అమీర్ ఖాన్ కు ఇల్లు ఉంది. అమీర్ జంట ఇక్కడే ఎక్కువగా ఉండేవారంట.. 2012–2013లో అతనికి రూ. 7 కోట్లు ఖర్చయింది, అతను రావును వివాహం చేసుకున్న కొద్ది నెలలకే, రెండు ఎకరాల (9,787 చ.మీ) విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఈ ఆస్తికి రూ. 42 లక్షల స్టాంప్ డ్యూటీ ఉంది.

7 /7

 ఉత్తరప్రదేశ్‌లోని షహాబాద్‌లో అమీర్ ఖాన్‌కు 22 ఇళ్లు కూడా ఉన్నాయి. ఈ గృహాలు అమీర్ ఖాన్ యొక్క వారసత్వ ఆస్తి,  ఈ ఆస్తులు సేల్స్ డీడ్‌లలో అమీర్ ఖాన్ పేరుతో ఉన్నాయని తెలుస్తోంది. అతని సోదరుడు ఫైసల్, సోదరీమణులు నిఖత్, ఫర్హత్ సహ-యజమానులుగా ఈ జాబితా లో ఉన్నారు.