Unclaimed Deposits: అయితే ఇప్పుడీ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల సమస్యకు దాదాపుగా తెరపడినట్టే కన్పిస్తోంది. అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లను గుర్తించి విత్‌డ్రా చేయడం ఇక సులభతరమౌతోంది. ఈ సమస్యకు ప్రత్యామ్నాయమే UDGAM Portal. ఈ పోర్టల్ ద్వారా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లను గుర్తించి విత్‌డ్రా చేసేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే ఈ పోర్టల్‌లో 30 బ్యాంకులు చేరాయి. మిగిలిన బ్యాంకులు కూడా వచ్చి చేరనున్నాయి. అసలీ ఉద్గమ్ పోర్టల్ అంటే ఏమిటి, ఎలా పనిచేస్తుంది, ఏయే బ్యాంకులున్నాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UDGAM Portal అనేది వివిధ బ్యాంకుల్లోని అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లకు సంబంధించిన సమాచారం లభించే వేదిక. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ పోర్టల్ రూపొందించింది. యూజర్లు ఈ పోర్టల్ ద్వారా అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఏకీకృత విధానమిది. ఆర్బీఐ చేపట్టిన డిపాజిటర్ ఎడ్యుకేషన్ ఎవేర్‌నెస్‌లో అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఓ భాగం. ఉద్గమ్ పోర్టల్ ద్వారా మొత్తం సమాచారం లభ్యమౌతుంది. ఈ పోర్టల్‌లో తరచూ ఎదురయ్యే కొన్ని ప్రశ్నల్ని ఆర్బీఐ పొందుపర్చింది. మార్చ్ 4 నాటికి 30 బ్యాంకులు ఈ పోర్టల్‌లో చేరాయి. దాదాపుగా 90 శాతం అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల సమాచారం ఇందులో ఉంది. 


ఎలా రిజిస్టర్ చేసుకోవాలి


యూజర్లు తమ పేరు, మొబైల్ నెంబర్ ఆధారంగా రిజిస్టర్ చేసుకోవాలి. దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ల సమాచారం ఒకేచోట ఈ పోర్టల్‌లో లభ్యమౌతుంది. ఆ డిపాజిట్లను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో కూడా వివరాలు ఉంటాయి. గత ఏడాది మార్చ్ నాటికి వివిధ బ్యాంకుల్లో కలిపి మొత్తం 42,270 కోట్ల అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధనలక్ష్మి బ్యాంక్ లిమిటెడ్, సౌత్ ఇండియా బ్యాంక్ లిమిటెడ్, డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్, సిటీ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఐడీబీఐ బ్యాంక్, జమ్ము కశ్మీర్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంక్, హెచ్‌ఎస్‌బిసీ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, ది కరూర్ వైశ్యా బ్యాంక్, సరస్వత్ కో ఆపరేటివ్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, తమిళనాడు మెర్కంటైల్ బ్యాంక్‌లు ఈ పోర్టల్‌లో చేరాయి. 


Also read: Hyundai Creta N Line Pics: లాంచ్ కంటే ముందే లీకైన Hyundai Creta N Line ఫోటోలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook