Hyundai Creta N Line in India: దేశంలో గత కొద్దికాలంగా ఎస్‌యూవీ క్రేజ్ పెరుగుతోంది. ఎస్‌యూవీ అనగానే ముందుగా గుర్తొచ్చేంది హ్యుండయ్ క్రెటా. ఇప్పుడు హ్యుండయ్ క్రెటా కొత్త వెర్షన్ క్రెటా ఎన్ లైన్ లాంచ్ కానుంది. మార్చ్ 11వ తేదీన లాంచ్ కానుండటంతో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. హ్యుండయ్ లాంచ్ కంటే ముందే క్రెటా ఎన్ లైన్ ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ ఫోటోలు లీకయ్యాయి. అవిప్పుడు వైరల్ అవుతున్నాయి.
మొత్తానికి హ్యుండయ్ క్రెటా ఎన్ లైన్ ఆకర్షణీయమైన డిజైన్‌తో అద్భుతంగా కన్పిస్తోంది.
ముందు భాగంలో రెగ్యులర్ క్రెటా కంటే బిన్నమైన గ్రిల్ ఉంటుంది. క్రెటా ఎన్ లైన్ సైడ్ ప్రొఫైల్ ఆల్ న్యూ ఆర్ 18 ఎల్లోయ్ వీల్‌తో వస్తుంది.
ఇందులో లెదర్ సీట్స్ ఉంటాయి. వాటిపై రెడ్ స్టిచింగ్ ఆకట్టుకుంటుంది. ఇందులో ఇన్‌ఫోటైన్‌మెంట్ యూనిట్ వాయిస్ సపోర్ట్‌తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ చేస్తుంది. ఎస్‌యూవీ డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, 360 డిగ్రీల సరౌండెడ్ కెమేరా, పనోరమిక్ సన్‌రూఫ్ ఉంటాయి.
డ్యాష్ బోర్డ్ లే అవుట్, ఎయిర్ కాన్ వెంట్, రేర్ లివర్‌లపై రెడ్ కలర్ లైన్స్ కన్పిస్తాయి. స్టీరింగ్ వీల్, రేర్ నాబ్, లెదర్ సీట్లపై కూడా అవే రెడ్ స్టిచింగ్ ఆకర్షణీయంగా కన్పిస్తుంది.
స్పోర్ట్ క్రెటా ఎన్ లైన్ ఇంటీరియర్‌లో కాంట్రస్టింగ్ రెడ్ ఇన్సర్ట్‌తో పాటు ఆల్ బ్లాక్ థీమ్ లభిస్తుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ కర్వ్డ్ 10.25 ఇంచెస్ హెచ్‌డి ఇన్‌ఫోటైన్‌మెంట్, 10.25 ఇంచెస్ డిజిటల్ క్లస్టర్ ఉంటుంది. కేబిన్ కూడా బ్లాక్ థీమ్ అండ్ రెడ్ ప్యాచెస్ ఉంటాయి.