Post Office KVP Account: కిసాన్ వికాస్ పత్ర పథకం ద్వారా మీ పెట్టుబడి కొన్ని నెలల్లోనే డబుల్ అవుతుంది. దీనికి ఎవరు అప్లై చేసుకోవాలి, అర్హత ఏంటి తెలుసుకుందాం.ప్రస్తుతం రకరకాల పెట్టుబడి విధానాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.  మీరు కూడా గరిష్ట పెట్టుబడితో ఎక్కువ వడ్డీ పొందాలనుకుంటే ఈ పోస్ట్‌ఆఫీస్ స్కీం ది బెస్ట్. కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెడితే కేవలం 115 నెలల్లోనే మీ పెట్టుబడి డబుల్ అవుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పథకానికి ఎవరు అర్హులు..
కిసాన్ వికాస్ పత్ర యోజనకు మైనారిటీ తీరిన ఎవరైన సింగిల్ లేదా జాయింట్ ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులు కూడా 10 ఏళ్ల వయస్సు ఉన్న తమ పిల్లల పేరుపై కూడా ఈ అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు.


ఎంత పెట్టుబడి పెట్టాలి?
ఈ పథకంలో కనీసం రూ.1000 నుంచి ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. కిసాన్ వికాస్ పత్ర యోజన పథకం ప్రత్యేకత ఏంటంటే ఇందులో గరిష్ట పెట్టుబడికి నియమం లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు.


ఇదీ చదవండి: Railway RRB Calendar 2024: రైల్వే జాబ్ కేలండర్ రిలీజ్.. ALP, టెక్నీషియన్‌తో సహా ఇతర పరీక్ష తేదీలు ఇవే..


115 నెలల్లోనే డబుల్..
కేవీపీ పథకంలో 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. దీంతో కేవలం 115 నెలల్లోనే మీ డబ్బు డబుల్ అవ్వడం పక్కా. ఒకవేళ మీరు రూ.1 లక్ష పెట్టుబడి పెడితే 115 నెలల్లోనే రూ.2 లక్షలవుతుంది. రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే నిర్ధిష్ట సమయంలో రూ.20 లక్షలు పొందుతారు.


కేవీపీలో పెట్టుబడి పెడితే కలిగే లాభాలు..


1. కిసాన్ వికాస్ పత్ర యోజనపై స్టాక్ మార్కెట్ ప్రభావం ఏమాత్రం ఉండదు.


2. ఇది కేంద్రప్రభుత్వ పోస్ట్‌ ఆఫీస్ గ్యారంటీ స్కీం. మీరు నిర్ధిష్ట సమయానికి డబ్బులు పొందుతారో లేదో అనే సందేహం లేదు.


3. ఏ పోస్ట్‌ఆఫీస్ లోనైనా ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు.


4. కేవీపీ పథకం 115 నెలలకు మెచ్యూరిటీ అవుతుంది. కానీ, మీ డబ్బులు పూర్తిగా వెనక్కి తీసుకునే వరకు వడ్డీ డబ్బులు యాడ్ అవుతూనే ఉంటాయి.


ఇదీ చదవండి: Top MBA Colleges in India: ఈ కాలేజీలో MBA పూర్తిచేస్తే కోట్లలో శాలరీ ప్యాకేజీ.. ఇది దేశంలోనే టాప్ కాలేజీ..


5. ఈ పథకంపై మీరు భద్రమైన లోన్ సౌకర్యాన్ని కూడా పొందుతారు.


6. ఈ పథకానికి అప్లై చేసుకునేవారు ఆధార్ కార్డు, వయస్సు ధృవీకరణ, పాస్ట్ పోర్ట్ సైజ్ ఫోటో, కేవీపీ దరఖాస్తు ఫారమ్ అవసరం. ఈ కేవీపీ ఖాతాను మీకు కావాలంటే ఎవరిపేరు మీదకైనా సులభంగా మార్చుకోవచ్చు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి