Railway RRB Calendar 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఇటీవల భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లలో వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో గ్రాడ్యుయేట్ (లెవల్ 4, 5 & 6),అండర్ గ్రాడ్యుయేట్ (లెవల్ 2 & 3) పోస్ట్‌లు, జూనియర్ ఇంజినీర్లు, పారామెడికల్ కేటగిరీ,మినిస్టీరియల్ & ఐసోలేటెడ్ కేటగిరీల కోసం నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలతో సహా వివిధ కేటగిరీలకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి. వాటి పరీక్షతేదీల షెడ్యూల్ చేర్చబడ్డాయి.
5696 అసిస్టెంట్ లోకో పైలట్ , 9000 టెక్నీషియన్ ఖాళీలు కూడా క్యాలెండర్‌లో పేర్కొన్నారు. ఈ వార్షిక క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ ,జూన్ నెలల మధ్య టెక్నీషియన్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుతం RRB ALP రిక్రూట్‌మెంట్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
NTPC (గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్), జూనియర్ ఇంజనీర్ (JE), పారామెడికల్ కేటగిరీ, గ్రూప్ D సహా వివిధ కేటగిరీలకు జూలై - సెప్టెంబర్ నెలల మధ్య నోటిఫికేషన్లు జారీ చేయబడతాయి.
అయితే, మినిస్టీరియల్ , ఐసోలేటెడ్ (MI) కేటగిరీలకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్, డిసెంబర్ 2024 మధ్య విడుదల కానుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) అధికారికంగా రైల్వే క్యాలెండర్ 2024ని విడుదల చేసింది. ఇది రాబోయే RRB రిక్రూట్‌మెంట్ షెడ్యూల్‌ను వివరిస్తుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగాల ఆశావహులు రైల్వే నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ చదవండి: Top MBA Colleges in India: ఈ కాలేజీలో MBA పూర్తిచేస్తే కోట్లలో శాలరీ ప్యాకేజీ.. ఇది దేశంలోనే టాప్ కాలేజీ..
సాంకేతిక నిపుణుల కోసం నోటిఫికేషన్ ఏప్రిల్ నుండి జూన్ వరకు షెడ్యూల్ చేయబడినట్లు క్యాలెండర్ చూపిస్తుంది. జూలై నుండి సెప్టెంబర్ వరకు నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయి), జూనియర్ ఇంజనీర్, పారామెడికల్ కేటగిరీతో సహా అనేక కేటగిరీలకు నోటిఫికేషన్లు జారీ చేయబడతాయి. చివరగా, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు, లెవెల్ 1 ప్రత్యేక కేటగిరీలకు నోటిఫికేషన్లు జారీ చేయబడతాయి.RRB పరీక్ష క్యాలెండర్‌ను తనిఖీ చేయడానికి ప్రత్యక్ష లింక్ https://www.rrbcdg.gov.in/uploads/2024%20-%20Calendar.pdf .(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook