Top MBA Colleges in India: డిగ్రీ పూర్తియిన వెంటనే కొందరు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తే మరికొందరు ఉన్నత చదువులకు వెళ్తారు. ఎంబీఏ పూర్తిచేయాలనుకునేవారు మంచి శాలరీ ప్యాకేజీ కోసం ఏ కాలేజీ బెస్ట్ అనే సందిగ్ధంలో పడతారు. చాలా మంది పిల్లలు గ్రాడ్యుయేషన్ తర్వాత MBA చేయాలనుకుంటున్నారు. ఎంబీఏ చేసిన తర్వాత మంచి ఉద్యోగాలు వస్తాయి. తెలిసినవారిని లేదా ఇంటర్నెట్ లో కాలేజీల జాబితా కోసం వెతుకుతారు. ఈరోజు మనం దేశంలోనే బెస్ట్ ఎంబీఏ కాలేజీలు ఏం ఉన్నాయో తద్వారా మీకు సూపర్ శాలరీ ప్యాకేజీ లభిస్తుందో తెలుసుకుందాం.
ఐఐఎం అహ్మదాబాద్..
ఐఐఎం అహ్మదాబాద్ ఎంబీఏ పూర్తి చేసి మంచి జాబ్ కొట్టాలనుకునేవారికి ఉత్తమ ఎంపిక.అయితే ఈ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడం అంత ఈజీ కాదు. మీరు ఈ కళాశాలలో మీ MBA చదివితే మీరు సులభంగా మంచి ఉద్యోగం పొందుతారు. ఐఐఎం అహ్మదాబాద్ కాలేజీ గుజరాత్‌లో ఉంది. ఇది NIRF ర్యాంకింగ్ 2022లో మొదటి స్థానంలో ఉంది. ఈ కాలేజీల సీటు పొందాలంటే మీరు CAT పరీక్షను క్లియర్ చేయాలి. ఆ తర్వాతే ఈ కళాశాలలో ప్రవేశం పొందగలరు.
ఇదీ చదవండి: PNB SO Recruitment 2024: పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 1025 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్.. ఇలా అప్లై చేసుకోండి..
ఐఐఎం కలకత్తా..
ఆ తర్వాతి స్థానంలో ఐఐఎం కలకత్తా ఉంది. ఇక్కడ కూడా టాప్ ర్యాంకర్లకు మాత్రమే ప్రవేశం లభిస్తుంది. మంచి కాలేజీలో ఎంబీఏ పూర్తి చేయాలనుకునేవారికి IIM కలకత్తాలో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇతర ఐఐఎం కాలేజీల కంటే ఇక్కడ కాస్త తక్కువ బడ్జెట్‌లో MBA లో అడ్మిషన్ తీసుకోవచ్చు. మీకు క్యాట్‌లో మంచి మార్కులు వచ్చినట్లయితే, ఈ కళాశాలలో అడ్మిషన్ తీసుకోండి.
ఇదీ చదవండి: Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్.. పరీక్ష లేకుండా రూ.69,000 జీతంతో ఉద్యోగం..
ఐఐఎం బెంగళూరు..
మీరు 2 సంవత్సరాల ఎంబీఏ డిగ్రీకి 20 - 25 లక్షలు ఖర్చు చేయగలిగితే ఈ కళాశాలలో అడ్మిషన్ తీసుకోండి. సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా డిగ్రీ పూర్తి చేసి ఐఐఎంలో డిగ్రీ పూర్తి చేయానుకునే విద్యార్థులకు మొదటి ఛాయిస్ ఐఐఎం బెంగుళూరు. అంతేకాదు ఈ కాలేజీలో చదివితే కోట్ల రూపాయల ప్యాకేజీ రాకుండా ఎవరూ ఆపలేరు. MBA చేయడానికి ఇంతకంటే గొప్ప కళాశాల మరొకటి ఉండదు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Mediaకి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook