Income Tax Slab: బడ్జెట్‌లో ఇన్‌కంటాక్స్ స్లాబ్ మారనుందా, పాత, కొత్త ట్యాక్స్ విధానాల అంతరం ఇదే
Income Tax Slab: కేంద్ర బడ్జెట్ 2024కు మరో రెండ్రోజులే ఉంది. ట్యాక్స్ పేయర్లకు ఈసారి బడ్జెట్‌లో ఉపశమనం లభించవచ్చని అంచనాలున్నాయి. ఇన్‌కంటాక్స్ స్లాబ్ మారవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Income Tax Slab: ప్రతి ఏటా ఉన్నట్టే ఈసారి బడ్జెట్‌లో కూడా ట్యాక్స్ పేయర్లకు చాలా అంచనాలున్నాయి. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్‌లో ఇన్‌కంటాక్స్ స్లాబ్‌లో మార్పులు చేయవచ్చని ఆశిస్తున్నారు. ముఖ్యంగా న్యూ ట్యాక్స్ రెజీమ్ వర్సెస్ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నారు.
ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ బడ్జెట్ మధ్యంతర బడ్జెట్‌గా ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాతే పూర్తి బడ్జెట్ ఉంటుంది. ఈసారి బడ్జెట్‌లో ట్యాక్స్ మినహాయింపులుంటాయనే అంచనా ఉంది. 2023 బడ్జెట్‌లో ట్యాక్స్ స్లాబ్‌లో కొన్ని మార్పులు జరిగాయి. ఈసారి కూడా ట్యాక్స్ స్లాబ్‌లో మార్పులుండవచ్చని అంచనా ఉంది.
న్యూ ట్యాక్స్ వర్సెస్ ఓల్డ్ ట్యాక్స్ రెజీమ్
ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలోనే ఏ ట్యాక్స్ విధానం ఎంచుకోవాలో అప్షన్ ఉంటుంది. ఏదైనా పొరపాటు జరిగితే ఆ ఆర్ధిక సంవత్సరం చివర్లో మార్చుకోవచ్చు. అసలు ఏ ట్యాక్స్ విధానం మంచిది, ఏది ఎలా ఉంటుందో తేడా తెలుసుకుందాం.
2023 బడ్జెట్‌లో మార్పుల తరువాత కొత్త ట్యాక్స్ విధానంలో 7 లక్షల వరకూ ఆదాయంపై ఎలాంటి మినహాయింపు ఉండదు. ఈ ఆదాయం పరిధిలో ఉండేవారికి కొత్త ట్యాక్స్ విధానం చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే 7 లక్షలు కాకుండా స్టాండర్డ్ డిడక్షన్ కింద మరో 50 వేలు ఉంటుంది. అంటే మొత్తం మీద 7.50 లక్షల వరకూ ఎలాంటి ట్యాక్స్ అవసరం లేదు.
కొత్త ట్యాక్స్ విధానంలో 6-9 లక్షల ఆదాయం ఉంటే 10 శాతం ట్యాక్స్ కట్ అవుతుంది. 12 లక్షల ఆదాయముంటే 9-15 శాతం ట్యాక్స్ కట్ అవుతుంది. ఇక 12-15 లక్షల ఆదాయముంటే 20 శాతం ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది.
పాత ట్యాక్స్ విధానంలో 2.5 లక్షల వరకూ ట్యాక్స్ ఉండదు. 2.5 నుంచి 5 లక్షల వరకూ ఆదాయంపై 5 శాతం ట్యాక్స్ చెల్లించాలి. అదే 5-7.5 లక్షల ఆదాయం ఉంటే 15 శాతం ట్యాక్స్ చెల్లించాలి. ఇక 7.5 లక్షల్నించి 10 లక్షల వరకూ ఆదాయంపై 20 శాతం ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే 30 శాతం ట్యాక్స్ డిడక్షన్ ఉంటుంది.
పాత ట్యాక్స్ విధానంలో ట్యాక్స్ మినహాయింపులకు అవకాశముంటుంది. అందే సెక్షన్ 80 సి, సెక్షన్ 80 డి ప్రకారం వివిధ రకాల ఇన్వెస్ట్‌మెంట్‌లు అంటే హోమ్ లోన్, మెడికల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, పీఎఫ్ వంటివాటి ద్వారా ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. సెక్షన్ 87ఏ కింద 7 లక్షల వరకూ ఆదాయానికి రిబేట్ వర్తింపచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook