Sukanya Samriddhi yojana: సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టినవారికి గుడ్‌న్యూస్. ప్రభుత్వం వడ్డీ భారీగా పెంచుతోంది. మీరు కూడా ఆ రెండు పధకాల్లో పెట్టుబడులు పెట్టారా..అయితే మీకు లాభమే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుకన్య సమృద్ధి యోజన, ఎన్ఎస్‌సి, పీపీఎఫ్ వంటి సేవింగ్ పధకాల్లో మీరు పెట్టుబడులు పెట్టి ఉంటే ఇది మీకు శుభవార్తే. ఎందుకంటే ఇప్పుడీ చిన్న పధకాలపై అద్భుతమైన రిటర్న్స్ లభించనున్నాయి. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యేజన వంటి సేవింగ్ పథకాలపై వడ్డీ రేట్లను భారీగా పెంచనున్నట్టు ప్రకటించనుంది. ఆర్ధికమంత్రిత్వ శాఖ ప్రతి త్రైమాసికం ప్రారంభానికి ముందు ప్రభుత్వ సేవింగ్ పధకాల వడ్డీ రేట్లను సమీక్షిస్తుంటుంది. ఈ నేపధ్యంలో 2022 సెప్టెంబర్ నుంచి ఆర్ధిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ పథకాలపై 0.50 నుంచి 0.75 శాతం వరకూ వడ్డీ రేట్లు పెంచేలా ప్రకటన జారీ చేయవచ్చు.


ఆర్బీఐ ఇప్పటికే రెండుసార్లు రెపో రేటు పెంచిన తరువాత కూడా జూన్ 30, 2022 న ఆర్ధిక మంత్రిత్వ శాఖ చిన్నచిన్న సేవింగ్ పథకాల వడ్డీ రేట్లలో మార్పులు చేయలేదు. అయితే ప్రస్తుత త్రైమాసికం అంటే సెప్టెంబర్ 2022 లో మాత్రం వడ్డీ రేట్లపై సమీక్ష నిర్వహించి..వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి. 


వాస్తవానికి ఆర్బీఐ రెపో రేటు పెంచినప్పటి నుంచి చాలా బ్యాంకులు డిపాజిట్ పథకాలపై వడ్డీ రేట్లు పెంచాయి. అందుకే ప్రభుత్వ సేవింగ్ పథకాలపై కూడా వడ్డీ రేట్లు పెంచే పరిస్థితి కన్పిస్తుంది. ప్రస్తుతం పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్‌పై 7.1 శాతం వార్షిక వడ్డీ లభిస్తుంది. అటు ఎన్‌ఎస్‌సిపై 6.8 వడ్డీ రేటు ఉంది. ఇక సుకన్య సమృద్ది యోజనపై ప్రస్తుతం 7.6 శాతం వడ్డీ లభిస్తోంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో 7.4 శాతం వడ్డీ అందుతోంది. ఇది కాకుండా కిసాన్ వికాస్ పత్రలో 6.9 శాతం వడ్డీ ఉంది. జూలై నుంచి ఈ పధకాలపై వడ్డీ రేట్లు పెరగవచ్చని అంచనా.


Also read: ATM Transactions: ఏటీఎం లావాదేవీలు ఉచితం కాదా, నెలకు ఎన్ని దాటితే ఎంత ఛార్జ్ పడుతుంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook