New Rules for Bank Account Opening and Sim Card Issue: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేక నిబంధనలు అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక నుంచి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి.. సిమ్ కార్డుల జారీ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇంకా అధికారంగా ప్రకటన రాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల కొత్త కొత్త మార్గాల్లో ఆన్‌లైన్ కేటుగాళ్లు ప్రజల నుంచి దోచుకుంటున్నారు. ఆన్‌లైన్ మోసాల గురించి ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. అత్యాశకు చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అవతలి వ్యక్తి చెప్పేది నిజమా..? కాదా..? అని ఆలోచించకుండా అడిగిన వివరాలు ఇచ్చేసి.. డబ్బులు పోయిన తరువాత లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాంక్‌ ఖాతాల్లో మోసాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త నిబంధనను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. కొత్త నిబంధన ప్రకారం.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన వ్యక్తి తప్ప.. మరే వ్యక్తి ఇతర వ్యక్తుల వివరాలను ఉపయోగించకుండా చేయాలని చూస్తోంది.


ప్రస్తుతం ఈకేవైసీ వెరీఫికేషన్ ఆన్‌లైన్‌లో కూడా నిర్వహిస్తుండగా.. త్వరలో భౌతిక ధృవీకరణను టెలికాం ఆపరేటర్‌లు, బ్యాంకులకు తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరైనా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడానికి.. సిమ్ కార్డ్ తీసుకోవడానికి ఆన్‌లైన్ ఈ-కేవైసీ ద్వారా ఆధార్ నుంచి వివరాలను తీసుకుని ధృవీకరిస్తున్నాయి. అయితే కొంతకాలంగా బ్యాంక్‌ మోసాలు భారీగా పెరిగాయి.


Also Read: Titanic Submarine: చివరికి విషాదాంతం.. టైటాన్ సబ్‌మెరైన్‌లో ఐదుగురు మృతి


ఈజీగా కొత్త నంబరుపై సిమ్ కార్డు తీసుకోవడం.. కొత్త స్కామ్ చేయడం తరువాత నంబరు బ్లాక్ చేయడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా సిమ్ కార్డు జారీ నిబంధనలు కఠితరం చేస్తే.. విచ్చలవిడిగా సిమ్ కార్డుల వినియోగం తగ్గి బ్యాంక్ మోసాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది. రూ.41 వేల కోట్లకు పైగా ప్రజలు డబ్బులు పోగొట్టుకున్నారని ఆర్‌బీఐ నివేదిక చెబుతున్నాయంటే.. ఏస్థాయిలో మోసాలు జరగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 


అందుకే కొత్త సిమ్ కార్డు జారీ, బ్యాంకు అకౌంట్ తెరిచే విధానాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. ఇందుకోసం కేవైసీ నిబంధనలను కఠినతరం చేయాలని యోచిస్తోంది. కొత్త నిబంధనలను అమలు చేయాలని టెలికాం ఆపరేటర్లు, బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది. ఇప్పటికే హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆర్థిక, టెలికాం మంత్రిత్వ శాఖలతో ఈ అంశంపై భేటీ అయింది. ఇందుకు సంబంధించి నిబంధనలు రూపొందిస్తున్నట్లు సమాచారం.


Also Read: Underwater Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలోనే భారత్‌లో అండర్ వాటర్ మెట్రో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి