Income Tax returns filling: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. గడువును సెప్టెంబరు 30వరకు పొడిగించింది. అయితే, కొత్త ఐటీ పోర్టల్‌లో సమస్యల కారణంగా ఐటీ రిటర్న్స్ ఫైల్(Income Tax returns filling) చేసేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, గడువు తేదీని మరోసారి పొడిగించే ఆలోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గడువు పెంచే యోచనలో ప్రభుత్వం
కొత్త ఐటీ వెబ్ సైట్‌లో ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేకుండా సెప్టెంబర్ 15వ తేదీ వరకు సిద్ధం చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman) ఇటీవల ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌(Infosys)కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మరో 15 రోజులపాటు ఐటీ రిటర్న్స్ చేసేందుకు వీలు కలుగవచ్చని భావిస్తున్నారు. ఐటీ రిటర్న్స్  గడువు పొడిగింపుకు సంబంధించి మరో రెండు మూడు రోజుల్లో కేంద్రం నుండి ఓ ప్రకటన రావొచ్చునని తెలుస్తోంది. 


మరోవైపు, సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ ఫైల్(Income Tax returns filling) చేసే వారికి ఇబ్బందులు రాకుండా గడువు పెంచే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుంటే, గత నాలుగు రోజుల్లో 4 లక్షల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారని, ఆగస్ట్ 21వ తేదీ నుండి వరుసగా రెండు రోజులు పని చేయలేదని చెప్పారు. 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 80 లక్షల మంది ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారని, ఆర్థిక సంవత్సరం 2020తో పోలిస్తే ఇది 14 శాతం మాత్రమే ఆదాయపన్ను శాఖ అధికారులు తెలిపారు. కొత్త పోర్టల్‌లో ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు సంబంధించి రోజువారీ డేటాతో సీబీడీటీ ముందుకు రానుందని తెలుస్తోంది.


రెండున్నర నెలలుగా ఇబ్బందులు
ఈ కొత్త వెబ్ సైట్(Website) జూన్ 7వ తేదీన ప్రారంభమైంది. అప్పటి నుండి రూ.4241 కోట్లు ఖర్చు చేశామని, నాటి నుండి నేటి వరకు సాంకేతిక సమస్యలు(Technical issues) వెన్నాడుతూనే ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండున్నర నెలలుగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. వెబ్ సైట్ సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు తమ టీం ప్రయత్నిస్తోందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ చెప్పారు. 750 మందికి పైగా సిబ్బంది ఐటీ శాఖ వెబ్ సైట్ పైన పని చేస్తున్నారన్నారు. ఇన్ఫోసిస్ సీఈవో ప్రవీణ్ రావు వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.


ఆదాయపు పన్ను శాఖ కొత్త పోర్టల్‌లో రెండున్నర నెలలుగా సాంకేతిక సమస్యల నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ గడువును మళ్లీ పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఐటీ రిటర్న్స్ గడువు జూలై 31వ తేదీ వరకు ఉంటుంది. అయితే వివిధ అంశాల నేపథ్యంలో గడువును సెప్టెంబర్ 30వ తేదీకి పొడిగించారు. కొత్త పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు కొనసాగుతున్నందున, ట్యాక్స్ పేయర్స్(Tax payers) రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఇబ్బందిపడుతున్నందున మరోసారి పొడిగించవచ్చునని నిపుణులు కూడా భావిస్తున్నారు. గతంలో టీసీఎస్(TCS) సంస్థ ఎంసీఏను బాగా హ్యాండ్లింగ్ చేసిందని, ప్రస్తుతం పాస్ పోర్ట్ ఆపరేషన్స్‌ను నిర్వహిస్తోంది. కొత్త ట్యాక్స్ పోర్టల్ అసైన్‌ను టీసీఎస్‌కు హ్యాండిల్ చేసి, ఏడాది సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే, పాత ఇన్‌కం ట్యాక్స్ పోర్టల్‌ను రిస్టోర్ చేయాలని పేర్కొన్నారు. దివ్యేష్ జైన్ ఈ ట్వీట్‌ను కూడా రీట్వీట్ చేస్తూ, పాత ఆదాయపు పన్ను శాఖ పోర్టల్‌ను రిస్టోర్ చేయాలన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook