LPG Gas Cylinder QR Code: ఎల్‌పీజీ సిలిండర్‌లో గ్యాస్ దొంగలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. గ్యాస్ సిలిండర్లో ఒకటి నుంచి రెండు కేజీల వరకు గ్యాస్ తక్కువ వస్తుందని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరైన స్పందన రావడం లేదు. దీంతో యథేచ్ఛగా గ్యాస్‌ను దొంగిలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్యాస్ దొంగలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్‌లకు QR కోడ్‌లతో అమర్చబోతోంది. దీంతో వినియోగదారులు అనేక సౌకర్యాలను పొందనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల నుంచి గ్యాస్ దొంగతనం నిరోధించడానికి QR కోడ్‌ను అమరుస్తున్నట్లు చెప్పారు. ఇది కొంతవరకు ఆధార్ కార్డ్ లాగా ఉంటుందన్నారు. ఈ QR కోడ్ ద్వారా గ్యాస్ సిలిండర్‌లో ఉన్న గ్యాస్‌ను ట్రాక్ చేయడం చాలా సులభమవుతుందన్నారు. అంతేకాడు ఎవరైనా గ్యాస్ సిలిండర్‌లో గ్యాస్‌ను దొంగిలిస్తే.. ట్రాక్ చేయడం చాలా సులభమని చెప్పారు.


ప్రపంచ ఎల్‌పీజీ వీక్ 2022 ప్రత్యేక సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. త్వరలో అన్ని ఎల్‌పీజీ సిలిండర్‌లపై క్యూఆర్ కోడ్ ఇన్‌స్టాల్ చేయనున్నట్లు హర్దీప్ సింగ్ పూరి చెప్పారు . ప్రభుత్వం ప్రాజెక్టు పనులు ప్రారంభించిందన్నారు. ఈ పనులను 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గ్యాస్ సిలిండర్‌పై QR కోడ్క మెటల్ స్టిక్కర్ అతికిస్తామని చెప్పారు.


QR కోడ్ ప్రయోజనాలు..


గ్యాస్ సిలిండర్‌లో QR కోడ్ (QR కోడ్‌తో LPG గ్యాస్ సిలిండర్) ఉండటం వలన దాని ట్రాకింగ్ చాలా సులభం అవుతుంది. ఇంతకుముందు తక్కువ గ్యాస్ పొందడం గురించి ఫిర్యాదు చేస్తే.. దానిని ట్రాక్ చేయడం సాధ్యమయ్యేది కాదు. కానీ ఇప్పుడు QR కోడ్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత దాన్ని ట్రాక్ చేయడం ఈజీ అవుతుంది. ఇంతకు ముందు డీలర్ గ్యాస్ సిలిండర్‌ను ఎక్కడి నుంచి తీశాడో, ఏ డెలివరీ మ్యాన్ కస్టమర్ ఇంటికి డెలివరీ చేశాడో తెలియరాలేదు. కానీ QR కోడ్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ప్రతిదీ ట్రాక్ చేయడం చాలా సులభం అవుతుంది. దీంతో దొంగను సులువుగా పట్టుకోవడంతోపాటు ప్రజల అనుమానాలకు తావు ఉండదు. 


అంతేకాకుండా ఇప్పటివరకు ఎన్నిసార్లు గ్యాస్ రీఫిల్ చేశారో వినియోగదారులకు తెలిసిపోతుంది. దీంతో పాటు రీఫిల్లింగ్ కేంద్రం నుంచి గ్యాస్ ఇంటికి చేరేందుకు ఎంత సమయం పట్టిందనే విషయం కూడా తెలుస్తుంది. అంతేకాకుండా గృహ గ్యాస్ సిలిండర్‌ను వాణిజ్య పనుల కోసం ఎవరూ ఉపయోగించలేరు. ఈ క్యూఆర్ కోడ్ నుంచి గ్యాస్ సిలిండర్ డెలివరీ ఏ డీలర్ ద్వారా జరిగిందో కూడా తెలుస్తుంది.


Also Read: Delhi Murder Case Updates: శ్రద్దాను హత్య చేసి ముఖాన్ని కాల్చిన అఫ్తాబ్.. విచారణలో షాకింగ్ విషయాలు   


Also Read: Shraddha Murder Case: శ్రద్ధా హత్యలో కీ క్లూ.. వాటర్ బిల్లుకు కనెక్షన్.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి