Shraddha Murder Case: ముంబైకు చెందిన యువతి శ్రద్ధా వాకర్ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఢిల్లీలో ఆమెను దారుణంగా హత్య చేసి నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావల్లా.. మృతదేహాన్ని 35 ముక్కలుగా కట్ చేసి వివిధ ప్రాంతాల్లో పాడేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడిని విచారిస్తున్న పోలీసులు.. విస్తుపోయే విషయాలను వెల్లడిస్తున్నారు. శ్రద్ధా తల కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతుండగా.. గురువారం నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరు పర్చనున్నారు. కస్టడీని పొడగించాలని పోలీసులు కోర్టును కోరనున్నారు.
శ్రద్దాను హత్య చేసిన తరువాత ఆమెను గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖాన్ని కాల్చినట్లు అఫ్తాబ్ పోలీసుల విచారణలో చెప్పాడు. తలను విసిరే ముందు గుర్తించలేని విధంగా ముఖాన్ని కాల్చినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పారవేసేందుకు ఇంటర్నెట్‌లో అన్వేషించానని అతను విచారణలో చెప్పాడు. శ్రద్దాను చంపి ఆమె శరీరాన్ని ముక్కలు చేసిన తర్వాత.. త్వరగా చెడిపోయే.. ఈజీగా ధ్వంసం చేయగల శరీర భాగాలను మొదట విసిరివేశాడు. సాక్ష్యాలను నాశనం చేయడానికి బ్లీచ్‌ను ఉపయోగించాడు. అంతే కాకుండా నేలపై ఒక్క రక్తపు మరక కూడా పడకుండా రసాయనాలు వాడినట్లు విచారణలో తేలింది.
హత్యానంతరం శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి చంపినట్లు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా విచారణ అనంతరం తెలిపాడు. అన్ని భాగాలను అడవిలో విసిరి.. బొటనవేలులోని ఒక భాగాన్ని వేరే ప్రదేశంలో విసిరాడు. విచారణలో సమయంలో అతనిలో తప్పు చేసిన భావం ఏమాత్రం కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. అతనితో హిందీలో మాట్లాడినప్పుడు.. ఇంగ్లీషులో సమాధానమిచ్చాడని అన్నారు. రాత్రిపూట పోలీస్ స్టేషన్ లాకప్‌లో ప్రశాంతంగా నిద్రపోతున్నాడని తెలిపారు.
విచారణలో పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలు
పోలీసులు: హత్య ఎప్పుడు, ఎలా చేశారు..?
అఫ్తాబ్: మే 18వ తేదీ రాత్రి శ్రద్ధతో గొడవ పడ్రు. గతంలో కూడా గొడవలు జరిగేవి. అయితే ఆ రోజు గొడవ ఎక్కువైంది. నేను శ్రద్దా ఛాతీపై కూర్చొని గొంతు నులిమి హత్య చేశాను.
పోలీసులు: మృతదేహాన్ని పోలీసులు ఏం చేశారు?
అఫ్తాబ్: శ్రద్దా మృతదేహాన్ని బాత్రూంలోకి లాగాను. రాత్రంతా మృతదేహం అక్కడే ఉంది.
పోలీసులు: శరీరం ఎప్పుడు, ఎలా ముక్కలు చేశారు..?
అఫ్తాబ్: నేను మే 19న మార్కెట్‌కి వెళ్లాను. స్థానిక మార్కెట్ నుంచి 300 లీటర్ల ఫ్రిజ్‌ని కొనుగోలు చేశారు. కీర్తి ఎలక్ట్రానిక్ షాప్ నుంచి ఫ్రిజ్ తీసుకున్నాను. వేరే షాపులో రంపాన్ని కొన్నారు. రాత్రి అదే బాత్‌రూమ్‌లో మృతదేహాన్ని రంపంతో ముక్కలు చేశా. మే 19న నేను మృతదేహంలోని కొన్ని ముక్కలను కత్తిరించాను. వాటిని పాలిథిన్‌లో వేసి ఫ్రిజ్‌లోని ఫ్రీజర్‌లో దాచి పెట్టాను. మిగిలిన మృతదేహాన్ని ఫ్రిజ్ కింది భాగంలో భద్రపరిచా. నేను గతంలో చెఫ్‌గా పనిచేయడంతో మృతదేహాన్ని సులభంగా కట్ చేశా..
పోలీసులు: శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేయడానికి ఎన్ని రోజులు పట్టింది..?
అఫ్తాబ్: రెండు రోజులు. మే 19, 20 తేదీలలో.
పోలీసులు: మీరు శరీర భాగాలను పారవేయడం ఎప్పుడు ప్రారంభించారు..?
అఫ్తాబ్: 19వ తేదీ రాత్రి, 20వ తేదీ రాత్రి. మొదటిసారిగా ఫ్రీజర్‌లోంచి కొన్ని ముక్కలు తీసి బ్యాగ్‌లో ఉంచారు. మొదటి రాత్రి ఆలస్యంగా బయటకు వెళ్లాలంటే భయపడ్డాను. తక్కువ ముక్కలను బ్యాగ్‌లో తీసుకువెళ్లి పాడేశాను.
పోలీసులు: మృతదేహం ముక్కలన్నీ ఎన్ని రోజుల్లో విసిరేశారు..?
అఫ్తాబ్- సరిగ్గా గుర్తులేదు.. కనీసం 20 రోజుల పాటు మృతదేహం ముక్కలను విసురుతూనే ఉన్నాను.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Delhi Murder Case Updates: శ్రద్దాను హత్య చేసి ముఖాన్ని కాల్చిన అఫ్తాబ్.. విచారణలో షాకింగ్ విషయాలు