/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Delhi Shraddha Murder Case Investigation: ఢిల్లీ శ్రద్ధా హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావల్లాను విచారిస్తున్న పోలీసులు.. విస్తుపోయే విషయాలను వెల్లడిస్తున్నారు. శ్రద్ధా మృతదేహాన్ని 35 ముక్కలుగా కట్ చేసి ఒక్కో ప్రాంతంలో ఒక పార్ట్ పాడేసిన అఫ్తాబ్ అమీన్ నుంచి కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. అయితే విచారణలో అతని సమాధానాలు పోలీసులను గందరగోళానికి గురి చేస్తున్నారు. శ్రద్ధా తల కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతోంది. గురువారం నిందితుడిని పోలీసులు కోర్టులో హాజరపర్చనున్నారు. కస్టడీని పొడగించాలని పోలీసులు కోర్టును కోరనున్నారు. 

ఈనేపథ్యంలోనే పోలీసులకు కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు అఫ్తాబ్ నీటి బిల్లుకు సంబంధించిన వ్యవహారం తెరపైకి వచ్చింది. నీటి కనెక్షన్ బిల్ హత్య కేసులో ముఖ్యమైన క్లూగా తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. అఫ్తాబ్‌ ఫ్లాట్‌కు రూ.300 వాటర్‌ బిల్లు బకాయి ఉన్నట్లు ఫ్లాట్‌ ఇరుగుపొరుగు వారి నుంచి పోలీసులకు సమాచారం అందింది.

ఢిల్లీ ప్రభుత్వం ప్రతి నెలా 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా ఇస్తుంది. దాదాపు అందరి బిల్లు జీరోనే వస్తుంది. కానీ అఫ్తాబ్ నీటి బిల్లు రూ.300 బకాయి ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అఫ్తాబ్ గది పైన నివసిస్తున్న ఇద్దరు పొరుగువారి నీటి బిల్లు సున్నా రాగా.. అఫ్తాబ్ ఫ్లాట్‌లో రూ.300 నీటి బిల్లు పెండింగ్ ఉంది. హత్య తర్వాత రక్తాన్ని శుభ్రం చేయడానికి అఫ్తాబ్ ఎక్కువ నీటిని ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. అందుకే రూ.300 వాటర్ బిల్లు వచ్చిందని సమాచారం. వాటర్ ట్యాంక్‌ను పదే పదే చూసేందుకు పైకి వెళ్లేవాడని పోలీసులకు చుట్టుపక్కల వాళ్లు చెప్పినట్లు తెలిసింది.

హత్యకు ఉపయోగించిన ఆయుధంపై అఫ్తాబ్ సరైన సమాధానం చెప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. శ్రద్ధా మొబైల్ ఎక్కడుందని అని అడిగితే.. ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. దీంతో పోలీసులు నార్కో టెస్టు సాయంతో ఈ మిస్టరీని చేధించే ప్రయత్నం చేస్తున్నారు. మెహ్రౌలీ అటవీప్రాంతంలో 13 ఎముకలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఎముకల DNA శ్రద్దా తండ్రి DNAతో సరిపోలింది.

అఫ్తాబ్ గుర్తుపై హత్యకు ఉపయోగించిన ఆయుధం, శ్రద్ధా ఫోన్, ఘటన సమయంలో ధరించిన దుస్తులు, ఇంకా చాలా వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. అందుకే ఈరోజు శ్రద్ధా హత్య కేసుకు చాలా కీలకం కానుంది. మరోవైపు నిందితుడు అఫ్తాబ్‌ను ఉరి తీయాలని శివసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. 

Also Read: David Warner: రష్మిక మందన్నకు సారీ చెప్పిన డేవిడ్ వార్నర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో  

Also Read: Ariyana Glory Suffers From fatigue : అరియానాకు వచ్చిన రోగం ఇదే.. ఇప్పుడు ఎలా ఉందంటే?.. బిగ్ బాస్ బ్యూటీ పోస్ట్ వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Section: 
English Title: 
Delhi police find new clue Aftab amin poonawalla water bill in shraddha murder case
News Source: 
Home Title: 

Shraddha Murder Case: శ్రద్ధా హత్యలో కీ క్లూ.. వాటర్ బిల్లుకు కనెక్షన్.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

Shraddha Murder Case: శ్రద్ధా హత్యలో కీ క్లూ.. వాటర్ బిల్లుకు కనెక్షన్.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
Caption: 
Delhi Shraddha Murder Case (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

ఢిల్లీ శ్రద్ధా హత్య కేసు విచారణ వేగవంతం

వెలుగులోకి సంచలన విషయాలు

వాటర్ పరిశీలిస్తే అవాక్కు
 

Mobile Title: 
శ్రద్ధా హత్యలో కీ క్లూ.. వాటర్ బిల్లుకు కనెక్షన్.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, November 17, 2022 - 12:56
Created By: 
Krindinti Ashok
Updated By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
136
Is Breaking News: 
No