Petrol-Diesel Price Latest Update: ఇటీవల రాఖీ పర్వదినం సందర్భంగా ఎలీపీజ్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. త్వరలోనే లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటోంది. ఈ తరుణంలోనే గ్యాస్ ధరల తరువాత పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్ణయం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. గత ఆరు నెలలుగా పెట్రోలు, డీజిల్‌పై చమురు కంపెనీలు లాభాల బాటలోనే నడుస్తున్నాయి. దీంతో వినియోగదారులపై భారం తగ్గించే అవకాశం కనిపిస్తోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను తగ్గించిందని చెప్పారు. ఉజ్వల పథకం కింద అందుతున్న సబ్సిడీకి ఈ ప్రయోజనం ఇటీవల తగ్గించిన మొత్తం జత చేసినట్లు తెలిపారు. భవిష్యత్‌లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రపంచ స్థాయిలో ముడి చమురు ధర స్థిరంగా ఉంటే.. ధరలలో తగ్గుదల ఉండవచ్చని అన్నారు. 


మరోవైపు శనివారం పెట్రోల్ పంప్ డీలర్ల సమావేశం జరగనుంది. ఈ భేటీలో డీలర్ల కమీషన్ పెంపుపై కూడా చర్చ జరగనుంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో ఎలాంటి సవరణలు జరిగినా.. ముందుగా సమాచారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ డీలర్ల తరఫున లేఖ కూడా రాయనున్నారు. ఈ మేరకు భారత పెట్రోలియం డీలర్ల కన్సార్టియం (సీఐపీడీ) పెట్రోలియం మంత్రికి లేఖ కూడా రాసింది. సీఐపీడీ కూడా రేటు మార్పు గురించి తెలియజేయాలని డిమాండ్ చేసింది. డీలర్ల కమీషన్‌ను పెంచాలని ప్రభుత్వం చమురు మార్కెటింగ్ కంపెనీలను (OMC) కూడా ఆదేశించాలని కోరింది.


దీపావళి గిఫ్ట్‌గా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటరుకు రూ.3 నుంచి 5 రూపాయల వరకు తగ్గుతాయని ప్రచారం జరుగుతోంది. నవంబర్, డిసెంబర్ నెలల మధ్య పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందని ఆశిస్తున్నారు. ఇక ఎల్‌పీజీ సిలిండర్ ధర తగ్గింపుతో సామాన్యులకు ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం లభించిందని జేఎం ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషనల్ సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది.


Also Read: Home Guard Ravinder Death: అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ దిక్కులేదు.. సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ  


Also Read: Aadhaar Card Update: ఆధార్ కార్డ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మూడు నెలలు గడువు పెంపు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి