Aadhaar Update Last Date: ఆధార్ కార్డు యూజర్లకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) గుడ్‌న్యూస్ చెప్పింది. ఉచితంగా అప్‌డేట్ చేయడానికి చివరి తేదీ గడువుని మరో మూడు నెలల పాటు పొడిగించింది. ప్రస్తుతం సెప్టెంబర్ 14 చివరి తేదీ ఉండగా.. డిసెంబర్ 14వ వరకు పెంచినట్లు ప్రకటించింది. ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా ఉచిత సదుపాయాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. దీంతో వచ్చే మూడు నెలల వరకు ఫ్రీగా ఆధార్‌లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. myAadhaar పోర్టల్ ద్వారా ఆధార్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు.
అదేవిధంగా మీరు ఆధార్‌ను అప్‌డేట్ చేసి పదేళ్లు అయినా.. తాజాగా మళ్లీ అప్‌డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌ని అప్‌డేట్ చేసుకోవడానికి myaadhaar.uidai.gov.in సందర్శించండి. డిసెంబరు 14వ తేదీ వరకు ఎలాంటి ఛార్జీ చెల్లించకుండా ఫ్రీగా ఆధార్ అప్‌డేట్ చేసుకోండి. ఆధార్ కేంద్రంలో అప్‌డేట్ చేసుకోవాలనుకుంటే రూ.25 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి.. గుర్తింపు కార్డు, అడ్రస్ ఫ్రూఫ్ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ ఆధార్ కార్డును ఎలా అప్‌డేట్ చేయాలటే..?
==> మీరు అధికారిక వెబ్‌సైట్ https://myaadhaar.uidai.gov.in/ ను సందర్శించండి.
==> మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఆధార్ నంబర్ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
==> ఐడీ, చిరునామా వివరాలను మీ ప్రొఫైల్‌లో ఎంటర్ చేయండి.
==> ఇప్పుడు తప్పుగా ఉన్న వివరాలను సరిదిద్దుకోండి.
==> మీ వివరాలు సరైనవి అయితే.. 'పై వివరాలు సరైనవని నేను ధృవీకరించాను' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
==> అనంతరం డ్రాప్-డౌన్ మెనుకి వెళ్లి ఐడెంటిటీ డాక్యుమెంట్‌పై క్లిక్ చేయండి
==> ఇప్పుడు డ్యాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్ చేయండి
==> డ్రాప్ డౌన్ మెను నుండి మీరు సబ్మిట్ చేయాలనుకుంటున్న అడ్రస్ ప్రూఫ్‌ను ఎంచుకోండి
==> మీ అడ్రస్ ప్రూఫ్‌ను అప్‌లోడ్ చేయాలి.
==> తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి. మీ వివరాలు అప్‌డేట్ అయిపోతాయి.
Also Read: AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుంచి, ఎజెండా ఏంటంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి